అయోధ్య రామమందిర నిర్మాణ వీడియో విడుదల

-

అయోధ్య రామ మందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2020 సంవత్సరం ఆగస్టు 5వ తేదీన అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. ప్రస్తుతం రామజన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం వీడియోను శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది.

ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయం లోని వివిధ ప్రదేశాలు, ఆలయానికి దారి తీసే రోడ్డు మార్గం తదితర అంశాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు ఉంది. ఈ వీడియోను త్రీడీ యానిమేషన్ విధానంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రూపొందించింది. ఇక ఈ వీడియోలు చూస్తూ ఉంటే… రామమందిరం మన దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది. కాగా 2023 డిసెంబర్ నుంచి అయోధ్య రామ మందిరంలోకి భక్తుల సందర్శనకు అనుమతి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news