ఇలా కనుక పండిస్తే రైతులకి కోట్లలో లాభాలు..!

-

కొన్నేళ్ళుగా మనం చూసుకున్నట్లయితే దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోతూనే ఉన్నారు. భూమిని పండించటం కంటే కూడా ఎక్కువగా కమర్షియల్ యూసేజ్ కి ఉపయోగిస్తున్నాము. దీంతో చాలా మట్టుకు పంటలు, పొలాలు కూడా తగ్గిపోతున్నాయి. అయితే రైతులు ఈ క్రమం లో ఈ టెక్నిక్ ని ఉపయోగించి పంటలు పండిస్తే మంచిగా లాభాలని పొందొచ్చు.

ఈ టెక్నిక్ ద్వారా పండ్లు, కూరగాయలను కూడా పండించవచ్చు. అయితే మరి ఆ టెక్నిక్ గురించి ఇప్పుడు చూద్దాం. కేవలం భూమి పైన మాత్రమే కాకుండా ఎక్కడైనా సరే పండ్లని, కూరగాయలని మనం పండించవచ్చు. ఆ టెక్నిక్ పేరు వర్టికల్ ఫార్మింగ్. అంటే నిలువు వ్యవసాయం.

ఈ టెక్నిక్ ని ఇజ్రాయెల్ తో పాటు ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నారు. నేల మీద నేల పైన కూడా ఈ టెక్నిక్ ని ఉపయోగించి వ్యవసాయం చెయ్యొచ్చు. మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ ఈ వ్యవసాయ పద్ధతిని మొదలు పెట్టారు. మహారాష్ట్రలో పసుపుని ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా పండిస్తున్నారు.

వెర్టికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఒకే ఒక ఎకరం నుంచి వంద ఎకరాల ఉత్పత్తిని పొందవచ్చు. మీరు సుమారుగా 2.5 కోట్లు ఒకే ఒక ఎకరంలో సంపాదించే అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు ఈ పద్ధతిని అనుసరించి ఎక్కువ లాభాలను పొందుతున్నారు. రైతుల కనుక ఈ ఫార్మింగ్ పైన అవగాహన ఏర్పరచుకుని ఈ పద్ధతిని అనుసరిస్తే తప్పకుండా కోట్లల్లో సంపాదించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news