చర్మ వయస్సును తగ్గించి మిమ్మల్ని యవ్వనంగా మార్చే కూరగాయల జ్యూస్.. తయారీ తెలుసుకోండి.

-

మీరు తీసుకునే ఆహారంలో రంగు రంగుల పదార్థాలు ఉండాలని, వాటివల్ల ఆరోగ్యం సమకూరుతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రకాల ఆహారాలని తీసుకోవడం చాలా ఉత్తమం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు విభిన్న రకాల ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు, పండ్లని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. ఐతే కొన్ని కూరగాయలతో చేసిన జ్యూస్ మీ చర్మ సంరక్షణకి తోడ్పడి మిమ్మల్ని యవ్వనంగా మార్చేందుకు సాయపడుతుంది తెలుసుకోండి.

ప్రస్తుతంమ్ ఆ జ్యూస్ తయారీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

ఆపిల్
క్యారట్
బీట్ రూట్
టమాట
దోసకాయ
స్వీట్ లైమ్
సెలెరీ
తాజా పసుపు
పొట్లకాయ

తయారీ పద్దతి

వీటన్నింటినీ ఒక దగ్గరకి చేర్చి గ్రైండ్ చేసి జ్యూస్ లాగా తయారు చేయండి. ఈ జ్యూస్ ని మీకు నచ్చిన సమయంలో తాగవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, ఇందులో ఉండే ఆపిల్, క్యారట్ వంటివి చర్మానికి చాలా మేలు చేస్తాయి. బీట్ రూట్ కారణంగా రక్తం పుట్టుకు వస్తుంది. బీట్ రూట్లని రక్తం పుట్టించే పండ్లు అని కూడా అంటారు. ఇక దోసకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

ఇక పసుపు గురించి చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో పసుపుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీలు ఉన్న పసుపు శరీరంలో విష పదార్థాలని బయటకి పంపించివేస్తుంది. ఇన్ని పోషకాలున్న ఆహార పదార్థాలతో తయారు చేసిన జ్యూస్ మరింత ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news