ముఖం మీద ఎలాంటి మచ్చలైనా సరే వీటితో ఈజీగా మాయం చేసేయొచ్చట.!

-

చర్మసౌందర్యం అంటే మొదట గుర్తుకువచ్చేది మగువలే. ఏ అమ్మాయి అయినా అందంగా ఉండాలనే కోరుకుంటుంది. అందంగా ఉండటం అంటే తెల్లగా ఉండటం మాత్రమే కాదు. చూడచక్కని ముఖం. ఆ ముఖం మీద ఎలాంటి మచ్చలు లేకుంటే చాలు ఛామనచాయగా ఉన్నా బాగుంటారు. అయితే ఎదిగే వయసులోనే పింపుల్స్ సమస్య ఎక్కువగా వస్తుంది. ఆ పింపుల్స్ వల్ల ఫేస్ మీద మచ్చలు ఏర్పడతాయి. పింపుల్స్ ని అయితే ఎలాగొలా పొగడతాం కానీ ఈ మచ్చలు అంత ఈజీగా పోనే పోవు. ఇంట్లో ఉండే వాటితో ఇలా చేస్తే ఈ మచ్చలు కూడా పోతాయట. అంతేకాదు మీ అందం కూడా ఇంకా రెట్టింపు అవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

టమాటా :

అందానికి టమాట బాగా పని చేస్తుంది. సూర్యుడి వేడి కారణంగా చర్మం మనకి ట్యాన్ అవుతూ ఉంటుంది. ఆ ట్యాన్ ని తగ్గించడానికి టమాటా బాగా పని చేస్తుంది. చర్మాన్ని అందంగా మారుస్తుంది. అలానే యాక్నీ సమస్యను కూడా తొలగిస్తుంది. దీని కోసం మీరు టమాటాలు తీసుకుని పేస్ట్ లా చేసుకుని వాటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకోండి… 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తూ ఉంటే వచ్చే అద్భుతమైన మార్పు మీరే గమనించచ్చు.

నిమ్మ :

చర్మాన్ని అందంగా మార్చడంలో నిమ్మ కూడా బాగా సహాయపడుతుంది. డార్క్ స్పాట్స్ వంటివి తగ్గిస్తుంది. దీని కోసం మీరు నిమ్మకాయని కట్ చేసి ఒక చెక్కని ఒక వైపు ముఖం మీద ఇంకో చెక్కని మరో వైపు ముఖం మీద అప్లై చేయండి. 10 నిమిషాల పాటు మీరు మీ చర్మాన్ని అలానే వదిలేసి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి. నిమ్మరసంని రాసుకుని వెంటనే ఎండలోకి వెళ్ళద్దు. దాని వలన ముఖం మండినట్లు అనిపిస్తుంది. అలానే డార్క్ స్పాట్స్ ని నిమ్మరసం బాగా తగ్గిస్తుంది. కనుక ఈ సమస్యతో బాధపడే వాళ్ళు నిమ్మని ఉపయోగిస్తే మంచిది. అయితే కేవలం డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్లే ఈ చిట్కాను పాటించండి. ఎందుకంటే ఫేస్ మీద ఎలాంటి మచ్చలు లేనప్పుడు ఇలా నిమ్మరసం రాయటం వల్ల ముఖం మీద ఉండే లేయర్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది..కొందిరికి అయితే దురదరావటం, ముఖం నల్లగా అవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి కేవలం ఎక్కడైతే నల్లమచ్చలు ఉన్నాయో అక్కడ మర్ధనా చేస్తే సరిపోతుంది.

పాలతో మెరిసే చర్మం

పాలు కూడా చాలా మంచి పద్ధతి. పాలని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం బాగుంటుంది. మీరు దీని కోసం ఒక టీ స్పూన్ పచ్చి పాలు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేస్తే చర్మం చాలా బాగుంటుంది. అలాగే చర్మానికి మాయిశ్చరైజర్ అవుతుంది

పెరుగు :

రెండు టీ స్పూన్ల పెరుగు తీసుకుని అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే చర్మం మరింత అందంగా మారుతుంది.

గుడ్డు :

గుడ్డు కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఒక గుడ్డు సొనని తీసుకొని ఒక బ్రష్ తో ముఖానికి అప్లై చేసి కొద్ది సేపు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక మీకు గుడ్డు వాసన నచ్చకపోతే అందులో నిమ్మ రసం, లావెండర్ వేసుకోవచ్చు. ఇలా మీరు దీనితో కూడా అద్భుతమైన ప్రయోజనం పొందవచ్చు.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ కూడా చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది. అలానే చర్మంపై ఉండే రంధ్రాలని క్లోజ్ చేస్తుంది కూడా. మీరు ఇంట్లోనే ఏదైనా ఫేస్ ప్యాక్ చేసుకుని అందులో రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి పట్టించవచ్చు. లేదా కేవలం రోజ్ వాటర్ ని కూడా మీరు మీ ముఖం పై అప్లై చేసుకోచ్చు. ఇలా మీరు అద్భుతమైన ప్రయోజనాలను రోజ్ వాటర్‌తో కూడా పొందొచ్చు.

శనగ పిండి :

చిన్నప్పటి నుండి కూడా శనగ పిండిని రాసుకుంటే మంచిది అని పెద్దవాళ్లు చెబుతుంటారు అయితే ఇది నిజంగా చాలా మంచి పద్ధతి. చర్మాన్ని అందంగా సాఫ్ట్‌గా మారుస్తుంది శనగ పిండి. అలానే దురదలు వంటి సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. అదే విధంగా చర్మాన్ని ఎంతో ఫ్రెష్‌గా ఉంచుతుంది. ముఖం మీద దీనిని అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కుంటే సరిపోతుంది.ఇలా తరుచూ చేస్తూ ఉంటే ముఖం మీద ఉండే మచ్చలు, అవాంఛిత రోమాలు కూడా పోతాయి.

కొబ్బరి నీళ్లు :

లేత కొబ్బరి నీళ్లు కూడా ముఖానికి చాలా బాగా పని చేస్తాయి. చర్మాన్ని అందంగా మార్చడానికి ఉపయోగ పడతాయి. లేత కొబ్బరి నీళ్ళలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. చర్మానికి రోజూ రెండు సార్లు లేత కొబ్బరి నీళ్లను రాసుకుంటే అద్భుతమైన మార్పును గమనించ వచ్చుట. పైగా ఇది చాలా సులువైన ప్రాసెస్. ఇది కొంచెం కాస్ట్లీ అయినా..మీ ఇంట్లో కొబ్బరిచెట్లు ఉంటే మాత్రం ఇది ట్రై చేయండి. చర్మం తెల్లగా అవటంలో కొబ్బరినీళ్లు బాగా ఉపయోగపడతాయి

ఇది సంగతి..వీటిలో మీకు ఈజీగా ఉండే టిప్స్ ని ఫాలో అయితే మంచి రిజల్ట్ మీ సొంతం. అయితే అన్నీ అందరికి పడాలని ఏం లేదు. కొంతమందికి నిమ్మకాయ అసలు ఫేస్ కి పడదు. కాబట్టి ఏది ట్రే చేస్తున్న మొదట ప్యాచ్ టెస్టు చేయటంమాత్రం మర్చిపోకండి. దాదాపు పై వాటిల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏం లేవు. ఒక్క నిమ్మకాయది తప్ప మిగతావి మీరు నిరభ్యంతరంగా చేసేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news