మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకు పోయాడు..కేసీఆర్ పై ష‌ర్మిల ఫైర్..!

-

11వ రోజు పాదయాత్ర లో వైఎస్ షర్మిల కేసీఆర్ పై తీవ్ర‌విమ‌ర్ష‌లు కురిపించారు. తెలంగాణ లో రాక్షస పాలన నడుస్తుందని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను నమ్మి రాష్ట్రాన్ని పెడితే ప్రజలను నట్టేట ముంచేశాడ‌ని ష‌ర్మిల అన్నారు. రెండు సార్లు అవకాశం ఇస్తే ఎవరు బాగు పడ్డారని అన్నారు. ప్రతి వర్గాన్ని కేసీఆర్ మోసం చేశాడని చెప్పారు. రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశాడని…కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశాడని ష‌ర్మిల ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు అని చెప్పి పేదలను మోసం చేశాడంటూ కేసీఆర్ పై ష‌ర్మిల ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పెన్షన్లు ఆపి వృద్ధులను మోసం చేశాడని..10 లక్షల మంది పెన్షన్లు దరఖాస్తులు పెట్టుకున్నారని కానీ నాలుగేళ్లు అవుతున్నా పెన్షన్లు అందడం లేదని ష‌ర్మిల ఆరోపించారు.

ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి యావత్ తెలంగాణ ను కేసీఆర్ మోసం చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి…7 ఏళ్లలో 8 వేల మంది రైతులు అప్పుల పాలు అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నార‌ని తెలిపారు. ఇదేనా బంగారు తెలంగాణ…ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నదంటూ కేసీఆర్ పై ష‌ర్మిల ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్ లు కట్టుకొని అందులో పడుకోవడానికి తెలంగాణ‌ తెచ్చుకున్నామా..? అంటూ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు ఎత్తుకు పోయాడు కేసీఆర్…మళ్ళీ మళ్ళీ కేసీఆర్ మాయలో పడొద్దు…మోస పోవద్దు అంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news