చలి కారణంగా పెదాలు పగిలి ఇబ్బందిగా ఉందా? ఐతే ఇది ట్రై చేయండి..

-

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు మొదలవుతుంటాయి. చలి కారణంగా వాతావరణంలో పెను మార్పులు రావడంతో అది చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మానికి వచ్చే సమస్యల్లో ముఖ్యమైన పొడిబారిపోవడం. ముఖం పొడిబారిపోవడం, పెదాలు పొడిబారిపోవడం మరీ ముఖ్యమైనది. ఐతే చలికాలం వీటి నుండి సంరక్షణ కోసం లిప్ బామ్ ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటివి కాకుండా నేచురల్ గా పెదాలు పొడిబారడం, పగలడం వంటి సమస్యలన్ను ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

చక్కెరతో చేసిన స్క్రబ్

దీనికి కావాల్సిన పదార్థాలు

చక్కెర
కొబ్బరి నూనె

చక్కెరని బాగా నలిపి పొడిలాగా చేసి, దానికి కొబ్బరి నూనెని కలిపుకుని ఆ మిశ్రమాన్ని పెదవులకి రాసుకోవాలి.

బ్లీచింగ్ మిక్సర్

ఈ పద్దతికి కావాల్సిన పదార్థాలు

తేనె
నిమ్మరసం
దూది ఉండ

తేనెలో నిమ్మరసం కలిపి దూది ఉండతో పెదవులకి దట్టించాలి. ఇలా రోజూ చేస్తే పగిలిన పెదాలు అందంగా తయారవుతాయి.

లిప్ బామ్

ఈ పద్దతికి కావాల్సిన పదార్థాలు

బీట్ రూట్ జ్యూస్
కలబంద రసం
కొబ్బరి నూనె

ఈ మూడింటినీ ఒకదగ్గర బాగా మిక్స్ చేసి పెదాలకి అప్లై చేసుకోవాలి. రోజూ రాత్రిపూట పడుకునే ముందు అప్లై చేసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పగిలిన పెదాలకి, ఎండిపోయిన పెదాలకి ఇదే చక్కటి మందులా పనిచేస్తుంది.

అంతే కాదు పెదాలని అందంగా చేసి ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. లిప్ బామ్ వంటి మెడికల్ కి సంబంధించినవి కాకుండా ప్రకృతి పరంగా దొరికే ఇలాంటి ఔషధాలు చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. అసలే చలికాలం. మీరూ ఒకసారి ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news