మార్కెట్ కి వెళ్ళినపుడు ఏదైనా చూసే కొంటాం. మనకి కావాల్సిన వాటినే కొనుక్కోవాలని చూస్తాం. కానీ ప్రస్తుత ప్రపంచంలో దారి పొడుగునా కనిపించే అద్దాల మేడల్లో ప్రతీదీ మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని సార్లు మనకి అవసరం లేనివి కూడా కొంటున్నాం. ఇంటికొచ్చాక, అరే ఇది ఎందుకు కొన్నాను? దీని అవసరం నాకు పెద్దగా లేదే? దీంట్లో నాకు కావాల్సిన పదార్థం లేదు, ఇది నాకు ఉపయోగపడదు అని అనుకుంటాం. ఏ విషయంలోనైనా ఇలా జరిగితే పెద్ద ప్రాబ్లం ఉండదు కావచ్చు. కానీ చర్మ సాధనాలు కొనేటప్పుడు మాత్రం కంగారు పడకూడదు. కన్ఫ్యూజ్ కాకూడదు.
చర్మానికి అప్లై చేసే ఏది కొనాలనుకున్నా ముందుగా టెస్ట్ చేయాల్సిందే. అది మీ శరీర రకానికి సూట్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటేనే బాగుంటుంది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఐతే చాలా మంది ముఖానికి రాసుకునే చర్మ సాధనాలపై శ్రద్ధ పెడతారు. కానీ బాడీ లోషన్ కి వచ్చేసరి ఏదో ఒకటిలే అని సర్దుకుపోతారు. ప్రస్తుతం కరోనా ప్రపంచంలో ఉన్నాం. మాటి మాటికీ చేతులని శానిటైజర్ తో కడుక్కుంటూ ఉంటున్నాం. దానివల్ల చేతులు పొడిబారిపోతున్నాయి.
దీన్నుండి కాపాడే బాడీ లోషన్లలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మొక్కలకి సంబంధించిన పదార్థాలు చర్మ సాధనాల్లో ఉంటే చిరాకు కలగకుండా ఉంటుంది. అలాంటి వాటిల్లో షియా బట్టర్ ఒకటి. మీరు కొనే బాడీ లోషన్లలో ఉండాల్సిన పదార్థాలు
చర్మాన్ని అందంగా మార్చడానికి షియా బట్టర్
చర్మాన్ని మృదువుగా ఉంచడానికి జోజోబా ఆయిల్, కోకో బట్టర్
చర్మ కణాలు చెడిపోకుండా ఉండడానికి కలబంద
చర్మ కణాలు అభివృద్ధి చెందడానికి కావాల్సిన విటమిన్ ఈ..
ఈ పదార్థాలు మీరు ఎంచుకున్న బాడీ లోషన్లో ఉండేలా చూసుకోండి.