ప్రస్తుతం ఇది కరోనా సమయం. ఇంట్లో నుండి బయటకు అడుగుపెట్టాలంటేనే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో పార్లర్ కి వెళ్ళి పెడిక్యూర్ చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అదే కాదు అసలు పెడిక్యూర్ చేసుకోవడమే శుద్ధ దండగ అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ పాదాలు, గోళ్ళ శుభ్రత చాలా మంచి విషయం. ఇది అనేక ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటుంది. అందుకే పెడిక్యూర్ చాలా అవసరం. ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుని, పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
పార్లర్ కి వెళ్ళేది లేదు కాబట్టి డబ్బు ఆదా అవుతుంది.