మైసూర్ పప్పుతో ఫేస్ ప్యాక్.. చర్మంపై ముడతలకు, మచ్చలకు చెక్ 

-

ఎండాకాలంలో స్కిన్ చాలా పాడవుతుంది. రోజంతా ఇంట్లోనే ఉన్నా.. సాయంత్రానికి డల్ అయిపోతాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. బయటకు వెళ్తే.. ఫేస్ ఇంకా పాడవుతుంది. చర్మం నల్లబడుతుంది. మెరుపు దూరమవుతుంది. బాహ్య చర్మ సంరక్షణ చాలా కీలకం.. స్కిన్ కు వంటగదిలో ఉండే.. మైసూర్ కందిపప్పు చాలా బాగా పనిచేస్తోందట. అందంగా మార్చడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా..?
 మైసూర్ పప్పు ప్యాక్ ఎలా వేయాలంటే..
పప్పు ప్యాక్ చేయడానికి, 4-5 స్పూన్ల పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాసి.. ఈ పప్పును ఉదయాన్నే శుభ్రంగా కడిగి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో నీటిని ఉపయోగించకూడదు. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను ముఖం నుండి మెడ వరకు చక్కగా అప్లై చేసుకోండి.
చేతులతో చర్మాన్ని లైట్ గా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు చర్మానికి వాడితే మంచి రిజల్ట్ వస్తుంది.
మైసూర్ పప్పు ఫేస్ ప్యాక్ వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి..?
ఈ పప్పులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త కణాలను ప్రోత్సహిస్తుంది, తద్వారా రక్త కణాలకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది. రక్తకణాల్లో ఆక్సిజన్ పరిమాణం పెరగడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.
పప్పు ప్యాక్ చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది. కాయధాన్యాలు ముఖంపై మచ్చలను తొలగించి చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.
దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మాన్ని కాలుష్యం నుండి కాపాడుతుంది, అలాగే చర్మంపై మెరుపు వస్తుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పు చర్మానికి పోషణనిస్తుంది. ముఖంపై మొటిమలను పోగొడుతుంది.
వేసవిలో ఈ మైసూర్ కందిపప్పు ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలోని జిగురు పోయి చర్మం తాజాగా చల్లగా ఉంటుంది. అంతేకాదండోయే.. ముఖం పై ముడతలను కూడా పోగొట్టి.. స్కిన్ కి మంచి గ్లోయింగ్ ఇస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news