మీరు మరింత అందంగా మారాలనుకుంటున్నారా..? బ్లాక్ హెడ్స్ Blackheads, యాక్నీ వంటి సమస్యల నుండి బయట పడాలని అనుకుంటున్నారా…? అయితే తప్పకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలను కనుక పాటించారు అంటే మీ సమస్యలు తొలగిపోతాయి. అయితే మరి ఇక ఆలస్యమెందుకు వీటి కోసమే పూర్తిగా చూసేయండి.
ఐస్:
మీరు ఫ్రిజ్ లో ఐస్ ని పెట్టి ఆ ఐస్ ని స్క్రీన్ మీద అప్లై చేస్తే మంచి బెనిఫిట్ మీకు కలుగుతుంది. చర్మం గ్లో కూడా పెరుగుతుంది.
గంధం పేస్ట్:
గంధం వల్ల చర్మానికి చాలా మేలు కలుగుతుంది. చర్మం గ్లో కూడా పెరుగుతుంది. బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు నుండి కూడా ఇది బయటపడేస్తుంది. ముడతలు కూడా రాకుండా చూసుకుంటుంది. కాబట్టి చందనం పేస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు:
యాక్నీ సమస్యని తొలగించడానికి కొబ్బరి నీళ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. చర్మం పై దీనిని అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. అంతే కాదు కొబ్బరి నీళ్ళు స్కిన్ టోనర్ గా కూడా పని చేస్తాయి.
గ్రీన్ టీ:
గ్రీన్ టీ ని ఫ్రిజ్ లో పెట్టి ఆ తర్వాత ముఖం మీద దానిని అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు. అంతే కాదు స్కిన్ ఇంఫ్లేమేషన్ సమస్య నుండి బయట పడవచ్చు. ఇలా ఈ విధంగా ప్రయత్నాలు చేసి చూడండి దీనితో మీరు చక్కటి బెనిఫిట్స్ పొందొచ్చు. యాక్నీ, బ్లాక్ హెడ్స్ నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు.