రేవంత్‌రెడ్డి revanth reddy పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మొదటి నుంచి ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌రెడ్డికి ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో ఆయన ప్రతి పక్షాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ఇక రేవంత్‌పై మొదటి నుంచి పార్టీ సీనియర్లు కాస్త గుర్రుగానే ఉంటున్నారు. మొదటి నుంచి వారంతా రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన సీనియర్లకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు.
ఆయన నిన్న టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేతబట్టిన తర్వాత వపర్ ఫుల్ గా మాట్లాడారు రేవంత్. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అసంతృప్త నేతలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఎవరైనా వ్యక్తిగత నినాదాలు ఇస్తే బాగుండదని, వారిని పార్టీ నుంచి డిస్మిస్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
ఇక్కడ రేవంత్ మాటలు చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇది పెద్ద హెచ్చరిక జారీ చేసినట్టు కనిపిస్తోంది. అలాగే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మిగతా వారిని కూడా కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా పగ్గాలు తీసుకున్నాడో లేదో అలా రేవంత్ ఇలాంటి హెచ్చరికలు చేయడంతో సీనియర్లు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. మరి వారంతా రేవంత్ కు సహకరిస్తారో లేదో అన్నది చూడాలి.