కురులు ఒత్తుగా, నల్లగా ఉండాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!

-

అందమైన కురులు మీ సొంతం చేసుకోవాలంటే ఈ ఇంటి చిట్కాలను పాటించండి. దీనితో మీ జుట్టు నల్లగా, ఒత్తుగా, సాఫ్ట్ గా ఉంటుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ కంటే కూడా ఇవి బాగా పని చేస్తాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ ఇంటి చిట్కాల గురించి ఇప్పుడే తెలుసుకోండి.

కురులు

గుడ్లు మరియు నిమ్మ:

జుట్టు అందంగా, సాఫ్ట్ గా ఉండడానికి గుడ్లు, నిమ్మ బాగా ఉపయోగ పడతాయి. చుండ్రుని తొలగించడానికి కూడా గుడ్లు బాగా ఉపయోగ పడతాయి. అయితే దీని కోసం మీరు నిమ్మ రసాన్ని తీసుకుని గుడ్డు సొన లో కలిపి జుట్టుకి బాగా అప్లై చేయండి. అర గంట నుండి గంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేసేయండి.

ఆలివ్ ఆయిల్:

మూడు రోజులకు ఒకసారి రాత్రి పూట ఆలివ్ ఆయిల్ ని తలకు పట్టించండి. దీని వల్ల జుట్టు కి మంచి పోషకాలు లభిస్తాయి. దీంతో కురులు అందంగా పొడవుగా ఉంటాయి.

నువ్వుల నూనె:

నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టుకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కురులకు నువ్వుల నూనె పట్టించడం వల్ల కురులు ఒత్తుగా మారతాయి. అదే విధంగా ఆముదంలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపి తలకు పట్టిస్తే కూడా మంచి ప్రయోజనాలు కనబడతాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news