ఆఫీసు పనిలో డెడ్ లైన్లు, ఆఫీసుకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ లు, ఇంటికి వచ్చాక సమస్యలు, నిద్ర పట్టకపోవడాలు, పక్కనున్న వాళ్లు అమాంతం ఎదిగిపోవడాలు, మనకు మాత్రం శాలరీ పెరగకపోవడాలు వంటి అనేక కారణాలవల్ల తలనొప్పి వస్తుంది.
ఒక్కోసారి మీ శరీరానికి పడని ఆహారం తీసుకున్నా కూడా తలనొప్పి వేధిస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి చాలామంది టాబ్లెట్స్ మీద ఆధారపడతారు. ప్రస్తుతం సహజంగా తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
అల్లం:
అల్లంలో ఉండే పోషకాలు తలనొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. అల్లాన్ని జ్యూస్ లాగా చేసి ఒక గ్లాసులో పోసుకొని, మరొక గ్లాసులో నిమ్మరసాన్ని తీసుకుని అల్లంకి కలపండి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది.
రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్:
దీన్ని మీ నుదుటి మీద చుక్కలుగా వేసుకొని చర్మం లోపలికి ఇంకిపోయేటట్లు మర్దన చేయాలి. తలనొప్పి వేధిస్తుంటే ఇలా చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులు:
మూడు లేదా నాలుగు తులసి ఆకులను తీసుకుని ఒక పాత్రలో వేసి, నీళ్లు పోసి బాగా మరిగించండి. ఆ తర్వాత అందులో తేనె కలపండి. ఇప్పుడు టీ తయారవగానే తాగండి. దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది. ఇలా కాకుండా తాజాగా ఉన్న తులసి ఆకులను నమలడం ద్వారా లేదా ఒక పాత్రలో ఉడకబెట్టిన తులసి ఆకుల నుండి వచ్చే ఆవిరిని పీల్చడం వల్ల కూడా తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఐస్ ప్యాక్:
కొందరికి ఐస్ ప్యాక్ వాడటం వల్ల కూడా తలనొప్పి నుండి విడుదల లభిస్తుంది. ఐస్ ప్యాక్ ని మెడ వెనుక భాగంలో మర్దన చేస్తే మంచి రిలీఫ్ కలుగుతుంది. ఇంకొందరికి వేడి బట్టతో కాపడం చేస్తే ఉపశమనం దొరుకుతుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.