మీ జుట్టు దృఢంగా, బలంగా కావడానికి పనికొచ్చే ఆవాలనూనె ఔషధం..

-

జుట్టు రాలడం చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఏదైనా పార్టీలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ చొక్కాపై కనిపించే వెంట్రుకలు రాలిపోయాయని గుర్తొచ్చి పార్టీలో ఉన్న మూడ్ ని పోగొడతాయి. చూడడానికిది చిన్న సమస్యలాగే కనిపిస్తున్నప్పటికీ మానసికంగా చాలా పెద్దదిగా తయారవుతుంది. రాలిపోతున్న జుట్టు మనలో టెన్షన్ ని పెంచుతూనే ఉంటుంది. ఇక పెళ్ళికాని వాళ్ళ పరిస్థితి చెప్పరానిది. పెళ్ళవకుండానే జుట్టు ఊడిపోతుందన్న బాధ వారిలో మరీ ఎక్కువగా ఉంటుంది. మరి దీనికోసం ఏం చేయాలి. మార్కెట్లో దొరికే చాలా సాధనాలు వాడే ఉంటారు. ఏదీ పెద్దగా ఫలితం ఇచ్చి ఉండదు. అందుకే ఆవాల నూనె ఔషధం ప్రయత్నించండి.

ఆవాల నూనెతో చేసిన ఔషధాన్ని వాడితే జుట్టు బలంగా మారి దృఢంగా తయారవుతుంది. ఆవాల నూనె ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

దీనికి కావాల్సిన పదార్థాలు

ఆవాల నూనె
ఒక చిన్న కప్పు మెంతులు

తయారీ విధానం

ముందుగా ఆవాల నూనెని ఒక పాత్రలో తీసుకోవాలి. అందులో మెంతులను వేసి ఒక రాత్రిపూట మొత్తం నూనెలోనే నానబెట్టండి.

మరుసటి రోజు ఆ నూనెని వేడి చేయాలి, మెంతులు కొద్దిగ నల్లబడడం మొదలవుతున్నప్పుడు పొయ్యి మీద నుండి కిందకి దించేయాలి. అప్పుడు దాన్ని మరో కప్పులోకి నింపుకుని నిల్వ చేసుకోవాలి. అల నిల్వ చేసిన దాన్ని జుట్టుకి పట్టించుకోవాలి. పొద్దున్న పూట కొబ్బరి నూనె రాసుకున్నట్టే, ఆవాల నూనె ఔషధాన్ని జుట్టుకి దట్టించాలి. నెత్తిలోకి బాగా ఇంకేలా రాసుకోవాలి. రాత్రిపూట ఇలా చేసుకుని పడుకుని, తెల్లారి లేవగానే షాంపూతో స్నానం చేయండి. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే మీ జుట్టు దృఢంగా మారి బలంగా తయారవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news