Health: వయసు పెరుగుతోందని భయమేస్తుందా..? ఈ టిప్స్ పాటిస్తే యవ్వనం మీ సొంతం..

-

చాలామందికి వయసు పెరుగుతుంటే ఒక రకమైన భయం వేస్తుంది. యవ్వనాన్ని దాటి పోతున్నామని, అప్పుడే పెద్దవాళ్లం అయిపోతున్నామని భయం వేస్తుంటుంది. ఈ భయాన్ని.. పెంచేవి కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా చర్మం మృదుత్వాన్ని కోల్పోవడం, లావుగా మారటం, పొట్ట, తల మీద బట్ట రావటం లాంటివి కూడా వయసు పెరుగుతుంటే ఒక రకమైన అభద్రతను కలిగిస్తాయి.

అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని టెన్షన్ ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కూడా భయపడకుండా బాధపడకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏంటో తెలుసుకుందాం.

సన్ స్క్రీన్:

చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే సన్ స్క్రీన్ తప్పనిసరిగా మర్దన చేసుకోవాలి. చాలామంది బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ ని అప్లై చేసుకుంటారు. ఇంట్లోనే ఉండి స్క్రీన్ ఎక్కువగా వాడేవాళ్లు అప్లై చేసుకోరు. కానీ లాప్ టాప్, మొబైల్స్ ఎక్కువగా వాడే వారు కూడా అప్లై చేసుకుంటే మంచిది.

హెల్తీ డైట్:

మీరు తీసుకునే ఆహారంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఖనిజ లవణాలు సరైన పాళ్ళలో ఉండేలా చూసుకోండి. బ్రేక్ ఫాస్ట్ కావలసినంతగా, లంచ్ మితంగా.. డిన్నర్ మరీ మితంగా తీసుకుంటే గట్ హెల్త్ బాగుంటుంది. గట్ హెల్త్ బాగుంటే అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు.

నీళ్లు, నిద్ర:

శరీరానికి కావలసినప్పుడల్లా నీటిని అందిస్తూ ఉండాలి. ఒక రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు.. శరీరానికి అవసరం అవుతుంది. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మీరు చేసే పనిని బట్టి మీకు ఎంత వాటర్ అవసరం ఉంటుందో తెలుసుకుని అంతవరకు తాగండి.

చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు పడుకోకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. నిద్ర సరిగ్గా లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు సరిగ్గా నిద్రపోతే నిత్యం యవ్వనంగా కనిపిస్తారు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది

Read more RELATED
Recommended to you

Latest news