జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడింలా..!

-

ఈ మధ్యకాలంలో జుట్టు సమస్యతో బాధపడని వారుండరూ. 18 ఏళ్ల వయసులోనే జుట్టు రాలటం మొదలవుతున్నాయి. 25 ఏళ్లకు తలపై జుట్టు పలుచబడుతోంది. 35 దాటితే బట్టతల వచ్చేస్తూ ఉంటింది. ఇలాంటి సమస్యతో బాధపడే కుర్రకారుకి తీరని వ్యథ లాంటిది. నలుగురిలో తిరగాలన్నా.. అందంగా కనిపించాలన్నా.. ఒత్తైన జుట్టు తప్పనిసరి. అయితే ఈ జుట్టు రాలే సమస్య వంశపారంపర్యంగా వస్తే.. మరికొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా సంభవిస్తుంది. నిద్ర, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక కారణాలు కావొచ్చు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలను పాటించండి.

ఉరుకుల పరుగుల జీవితంలో తీరికలేని పని.. దీంతో ఒత్తిడి, నిద్రలేమి. ఈ సమస్య కేవలం ఆరోగ్యంపైనే కాదా మీ జుట్టు మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజూ యోగా, ధ్యానం, శారీరక శ్రమకు సమయం కేటాయించాలి. 30 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. శరీరానికి సరిపడా నీటిని తాగాలి. అప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం.. జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఆరోగ్యవంతమైన జుట్టు కోసం ప్రాటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, సోయా, పాలు, పప్పు వంటివి ఆహారంగా తీసుకోవాలి. ఐరన్ , జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్-బీలో ఎక్కువగా మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ జుట్టును మెరిసేలా చేస్తుంది.

ఇంటి చిట్కాలు..
– రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రసాన్ని జుట్టుకు రాసుకని పడుకోవాలి. ఉదయం పూట షాంపుతో తలంటుకోవాలి.
– ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఉల్లి రసం తలకు అంటించడంతో కుదుళ్లు గట్టిగా ఉంటాయి.
– కందగడ్డను కొబ్బరినూనెలో కలుపుకుని జుట్టుకు పూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
– కొబ్బరిపాలలో ఖనిజాలు, ప్రోటీన్లు అధికం. కొబ్బరి పాలను తలకు రాసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీరు, షాంపుతో తలంటుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news