కరోనా టైమ్: ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Join Our COmmunity

డిసెంబర్ 1వ తేదీ.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. హెచ్ ఐ వీ ఎయిడ్స్ పై అవగాహన పెంచి, అది సోకకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజెప్పేంచుకు డిసెంబర్ 1వ తేదిని ప్రపంచ ఎయిడ్స్ దినంగా జరుపుతున్నారు. 2017 సంవత్సరం లెక్కల ప్రకారం ప్రపంచ ఎయిడ్స్ జనాభాలో భారతదేశం మూడవస్థానంలో ఉంది. 2.14 మిలియన్ల ప్రజలు ఎయిడ్స్ తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఐతే కరోనా టైమ్ లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇక్కడ్స తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కరోనా వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. ఎయిడ్స్ బారిన పడినవారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. దీని కారణంగా హెచ్ ఐ వీ తో బాధపడేవారు కరోనా వైరస్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత టైమ్ లో మరింత జాగ్రత్త అవసరం.

శ్వాస సంబంధమైన ఇబ్బందులని కలిగించే కరోనా వైరస్, ఇతర వ్యాధులతో పోరాడుతున్న వారిలో ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే హెచ్ ఐవీ బారిన పడ్డవారు, భౌతిక దూరం పాటించాలి. బయటకి వెళ్ళిన ప్రతీసారి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ప్రతి రోజూ వ్యాయామం, డాక్టరు చెప్పినట్టుగా విధిగా మందులు వేసుకోవాలి. ఏమాత్రం కొంచెం అనుమానం వచ్చిన ఆలస్యం చేయకుండా డాక్టరుని సంప్రదించడం మంచిది.

హెచ్ ఐ వీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఈ మధ్య టాటూలపై యువతకి చాలా క్రేజ్ ఉంది. టాటూ వేసుకునే సమయంలో జాగ్రత్త చాలా అవసరం. టాటూ వేయడానికి కొత్త సూది వాడుతున్నారా లేదా చూసుకోండి.

సెలూన్లలో తెలియకుండానే బ్లేడ్ తెగే అవకాశం ఉంటుంది. కొత్త బ్లేడ్ వాడుతున్నారా లేదా చూడండి.

అనవసర సంబంధాలు పెట్టుకుని ఇబ్బందుల పాలు కావద్దు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news