గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. చిన్న చిన్న ఘర్షణలు మినహా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగానే ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో గుర్తుల విషయంలో వివాదం రేగింది. సిపిఐ, సిపిఎం గుర్తుల విషయంలో గొడవ రేగింది. ఓల్డ్ మలక్ పెట్ డివిజన్ లో 69 స్తానాలలో ఎన్నికల సంఘం పోలింగ్ నిలిపివేసింది. రేపు రీ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పింది.
కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తు వచ్చింది. రీ పోలింగ్ ఉన్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదు అయింది. కొన్ని చోట్ల ఘటనలు జరగడంతో పోలింగ్ ఆలస్యం అవుతుంది. ఆర్సీ పురంలో 25 శాతం పోలింగ్ నమోదు అయింది.