ఉల్లి నూనెలో ఇవి కలిపి రాస్తే బట్టతలపై కూడా జుట్టు వస్తుంది

-

ఈరోజుల్లో అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు సమస్య వచ్చిందంటే.. అది అంతలే దానికి పరిష్కారం లేదని వదిలేసేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఏ సమస్యకు అయినా సొల్యూషన్‌ ఉంటుంది. బట్టతలపై కూడా జుట్టు మొలిపించేయొచ్చు. దీనికి ప్రత్యేకంగా చికిత్సలు ఉన్నాయి. అవి ఖర్చు వద్దూ అనుకుంటే కొన్ని ఆయుర్వేద మార్గాలను ఎంచుకున్నా బట్టతలపై జుట్టు మొలిపించవచ్చు. మీకు ఇప్పుడిప్పుడే సమస్య స్టాట్‌ అవుతుందంటే.. వెంటనే ఇలా చేసేయండి..! నెల రోజుల్లోనే మార్పు వస్తుంది. ఉల్లిపాయ నూనెను వాడటం వల్ల హెయిర్‌ గ్రోత్ బాగుంటుంది. ఇది జుట్టు పెరగడం ఆగిపోయిన కణాల్లో కూడా మళ్లీ ఉత్తేజాన్ని ఇచ్చి జుట్టు మొలిచేలా చేస్తుంది.

జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయ రసంతో పాటు, దాని నుంచి తీసిన నూనెను కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి.

ఉల్లిపాయ నూనెలో అలోవెరా జెల్‌ను కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా రాలిపోయిన జుట్టు సులభంగా తిరిగి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా ఆపుతాయి. అలోవేరా పడిని వాళ్లు ఇలా చేయండి.

ఉల్లిపాయ నూనెలో ఆవాల నూనెను మిక్స్‌ చేసి అప్లై చేసుకోవడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.

గుడ్డు తెల్ల సొనలో ఉల్లిపాయ నూనెను మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.

జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ఈ ఉల్లిపాయ నూనెను వినియోగించే క్రమంలో తప్పకుండా జుట్టును సాధారణ షాంపూలతో మాత్రమే వాడాల్సి ఉంటుంది. రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూను వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news