తెలంగాణ పథకాలకు నీతిఅయోగ్‌ కితాబిచ్చింది : కేటీఆర్‌

-

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ ఘనతలను వివరించారు. దేశంలో వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటలూ కరెంటు అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని, గురుకులాల్లో చదివే విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతిఆయోగ్ కూడా అభినందించిందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ మున్సిపాలిటీలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 సర్వేలో పారిశుద్ధ్యంలో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని కేటీఆర్ గర్వంగా చెప్పారు.

Hyderabad will leave behind Chennai and Bengaluru in many sectors: KTR-Telangana  Today

దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందన్నారు. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామన్నారు.

అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నేను రాను బిడ్డా సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news