ఓట్స్ తో ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మొటిమలు మాయం.. జిడ్డు కూడా..!

-

డైట్ లో ఉన్నప్పుడు ఓట్స్ కచ్చితంగా చేర్చుకుంటారు. ఇది బరువు తగ్గడానికే కాదు..చర్మానికి అందాన్ని తేవడానికి కూడా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు, సిలికా చర్మానికి నాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఈరోజు ఓట్స్ తో తయారు చేసుకునే వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను చూద్దామా..!

ఓట్స్ తో ఫేస్ ప్యాక్స్..

రెండు స్పూన్ల ఓట్ మీల్ పొడిలో చెంచా తేనె, రెండు స్పూన్ల పాలూ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొన్ని ఓట్స్ తీసుకుని వాటికి టొమాటో గుజ్జు చేర్చాలి. ఒట్స్ మొత్తబడి చిక్కని పేస్ట్ అయ్యాక ముఖానికి పట్టించాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే సరిపోతుంది. టొమాటో నలుపు దననాన్ని తొలగించటంలో సహాయపడుతుంది. ఓట్స్ లోని పీచు పదార్ధాలు జిడ్డుని తొలగిస్తాయి. ఫేస్ సూపర్ లుక్ వస్తుంది.

రెండు స్పూన్ల ఓట్స్ లో సగం నిమ్మకాయ రసం, స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లకు ఇది బాగా పనిచేస్తుంది. నిమ్మరసం , ఓట్స్ మిశ్రమం చర్మంలోని జిడ్డు తొలగించేందుకు సాయపడతాయి. ఆలివ్ నూనె చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.

మొటిమల నివారణకోసం రెండు చెంచాల ఓట్స్ ను నీళ్లలో లేదా పాలలో వేసి ఉడికించాలి. చిక్కని మిశ్రమం అయ్యాక తీసేసి.. కొద్దిగా చల్లారిన తరువాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పావుగంట తరువాత గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే చాలు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయట.

సో ఈ సారి ఓట్స్ తో కూడా ఫేస్ ప్యాక్ ట్రే చేసి చూడండి. నిజానికి..ఇంటి చిట్కాలతోనే ఫేస్ కు ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు. ఇంకా వీటి వల్ల రిజల్ట్ కాస్త లేట్ అయినా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మంచి ఫలితం ఉంటుంది. కెమికల్ ఉన్న క్రీమ్స్ వాడటం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news