LED Therapy: ముఖానికి కాంతితో చికిత్స.. ఈ థెరపీ వల్ల అందం రెట్టింపు అవుతుందా..?

-

మన దగ్గర పైసలు దండిగా ఉంటే చాలు ఎలాంటి చర్మాన్ని అయినా అందంగా మార్చేయొచ్చు. ముఖంపై ఎన్ని సమస్యలు ఉన్నా తొలగించవచ్చు. అలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో ఒకటి LED therapy. నొప్పి లేకుండా, తక్కువ టైంలో ఉత్తమ ఫలితాలను కనబరుస్తున్న ఈ చికిత్స ఇప్పుడు నయా ట్రెండ్‌ అవుతోంది. అసలు ఇది ఎంత వరకూ మేలు చేస్తుంది..? దీని వల్ల లాభాలు ఏంటో చూద్దామా..!

కాంతి రావడానికి ఏవేవో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటాం.. ఏకంగా కాంతినే ఫేస్‌ ప్యాక్‌ వేస్తే.. అదే LED therapy. ముఖంపై ముడతలు, మొటిమలు అలాగే ఇతర చర్మ సమస్యలను తొలగించి, చర్మాన్ని పునరుజ్జీవనం చేయడానికి ఇప్పుడు కొంతమంది సౌందర్య నిపుణులు LED లైట్ థెరపీని ఉపయోగిస్తున్నారు. దీనిని ఫోటో-డైనమిక్ లేదా లైట్ థెరపీ అని కూడా పిలుస్తారు. జుట్టు రాలడం సంబంధిత సమస్యలకు సంబంధించిన చికిత్సలకు ఈ థెరపీ వాడుకలో ఉంది.

ఈ LED థెరపీలో కాంతిని ప్రసరింపజేసే మాస్క్‌ను ముఖానికి వేస్తారు.. ఈ మాస్క్ వివిధ రకాల LED తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాలను పంపిస్తుంది. నిర్దిష్ట తరంగదైర్ఘ్యానికి అనుగుణంగా వెలువడే సూక్ష్మ LED కిరణాలు చర్మాన్ని సమకాలీకరణం చేస్తాయట… తద్వారా చర్మ సమస్యలు నెమ్మదినెమ్మదిగా నయం అవుతాయి. ఈ ప్రక్రియలో 15-20 నిమిషాల పాటు కాంతిని పంపిణీ చేస్తారు. ఇలా వివిధ సిట్టింగ్‌లలో చికిత్సను అందిస్తారు. వింటుంటేనే భలే ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ..!

LED Therapyలో రకాలు

వ్యక్తులకు ఉన్న చర్మ సమస్య రకాన్ని బట్టి కాంతి పౌనఃపున్యాలు మారుతూ ఉంటాయి. యాంటీ ఏజింగ్ చికిత్స కోసం ఎరుపు రంగు LED థెరపీ ఉపయోగిస్తారు, నీలం మొటిమల చికిత్సకు ఉపయోగిస్తారు.

గ్రీన్ లైట్: ఇది ఎరుపును, దద్దుర్లను తగ్గిస్తుంది. చర్మం మొత్తం ఆకృతిని మెరుగుపరుస్తుంది. లేజర్ చికిత్సలు, వడదెబ్బల చికిత్సలకు ఈ థెరపీ ఉత్తమంగా పనిచేస్తుందట. పోస్ట్-ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది.

రెడ్ లైట్: ఇది కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి చేసే కణాలను ప్రేరేపిస్తుంది. దీనిని ప్రధానంగా యాంటీ ఏజింగ్ చికిత్సల కోసం వాడతరా.ు.

ఎల్లో లైట్: ఇది ముఖ కండరాలను టోన్ చేస్తుంది, బిగుతుగా చేస్తుంది. ఇది చర్మానికి శక్తినిస్తుంది, యాంటీఅలెర్జెన్‌గా కూడా పనిచేస్తుంది.

బ్లూ లైట్: ఇది పెద్దగా మారే సిస్టిక్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా పనిచేస్తుంది. ఈ కాంతి చర్మాన్ని క్రిమిరహితం చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందట..

ఇన్‌ఫ్రారెడ్ లైట్: ఇవి పొడవైన తరంగదైర్ఘ్యాలు కలిగిన లైట్లు. చర్మ కణాల పనితీరును లోతైన స్థాయిలలో ప్రేరేపించడం ద్వారా చర్మ సమస్యలను నయం చేసేందుకు ఉపయోగిస్తారు.

LED Therapy అందరూ తీసుకోవచ్చా..?

ఈ LED థెరపీ అనేది నొప్పి లేని సర్జరీ లాంటిది. చర్మం దద్దుర్లు కలవారు, ముడతలు తగ్గించుకోవాలనుకునే వారు, చిన్న రక్తనాళాల రూపాన్ని తగ్గించాలనుకునే వారు, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నవారు, కాలిన మచ్చలు, మొటిమల మచ్చలు, రోసేసియా, తామర, సోరియాసిస్, అథ్లెట్స్ ఫుట్ ఉన్నవారు, కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు, పిగ్మెంటేషన్ ఉన్నవారు, జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు LED థెరపీని తీసుకోవచ్చు.

వీరికి వద్దంట..

గర్భిణులు, పాలు ఇచ్చే మహిళలు, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, ఫోటోఎస్థీషియా చరిత్ర కలిగిన వారు, మిగతా ఏదైనా సర్జరీలు లేదా చికిత్సలు తీసుకునే వారు ఈ LED therapyని చేయించుకోకూడదు..

ఆసక్తి ఉన్నవారు..చికిత్స చేయించుకునే ముందు డెర్మాటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచింది.. దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి.. మీ స్కిన్‌కు ఇది ఒకవేళ పడకపోతే.. కాబట్టి ముందు డాక్టర్‌ను సంప్రదిస్తే..వారు వివరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news