బెండకాయతో ముఖం మీద ట్యాన్‌ను తొలగిద్దామా..!

-

కాసేపు ఎండలో బయటకు వెళ్లి వస్తే చాలు మొత్తం ట్యాన్‌ అయిపోతుంది. కొంతమంది ఎండలోకి వెళ్లకున్నా కూడా.. ఫోర్‌ హెడ్‌మీద మాత్రమే నల్లగా ఉంటుంది. చేతులకు కూడా ఎక్కువ ట్యాన్‌ ఉంటుంది. వీటికోసం పార్లర్‌లో ట్యాన్‌ ప్యాక్‌ వేయించుకుందాం అంటే.. వాళ్లు మినిమన్‌ 500కు తక్కువ చెప్పరు. అంత పెట్టి ఏం వేయించుకుంటాంలే అని లైట్‌ తీసుకుంటారు. ఇంట్లోనే అదిరిపోయే ట్యాన్‌ ప్యాక్‌ రెడీ చేసుకోవచ్చు తెలుసా..? బెండకాయతో ట్యాన్‌ ప్యాక్‌ ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని బెండకాయను కడిగి ఆ గిన్నెలో ముక్కలుగా చేసి వేయండి. అందులో 1 చెంచా తేనె, 2 చెంచాల పాలపొడి వేసి బాగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమం ముఖంలోని టాన్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు మరియు పాదాలకు అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని మందంగా రాయండి. తర్వాత 20 నిమిషాలు నాననివ్వాలి.

తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే ఇన్‌స్టంట్‌ రిజల్ట్‌ ఉంటుంది. టాన్ తొలగించి చర్మ కాంతిని పునరుద్ధరిస్తుంది. ఓక్రా ప్యాక్‌ను సాధారణ గృహోపకరణాలతో తయారు చేయవచ్చు.

బెండకాయ ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. బెండకాయకు కుంకుమపువ్వు జోడిస్తే ఇంకా బాగుంటుంది.

మరొక చిట్కా కూడా ఉంది. కాఫీ పౌడర్‌తో కూడా ట్యాన్‌ను తొలగించుకోవచ్చు. పెరుగు, తేనె, బియ్యంపిండి, కాఫీ పౌడర్‌, టమాట రసం అన్నీ స్పూన్‌ చొప్పున తీసుకోండి. బాకా మిక్స్‌ చేసి ముఖం మొత్తం అప్లై చేయండి. అది ఆరిపోయిన తర్వాత.. లైట్‌గా చేతులను తడి. చేసుకుంటూ..రబ్‌ చేయండి. ఎక్కడైతే ట్యాన్‌ ఉంటుందో అక్కడ బాగా ఎక్కువ సేపు రబ్‌ చేయండి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే.. మీ ముఖం మీద ట్యాన్‌ పోవడమే కాకుండా.. స్కిన్‌ వైట్‌గా కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news