విశాఖలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఉక్కపోతతో ప్రజలు విలవిల

-

వర్షకాలంలో ఎండలు మండుతున్నారు. ఇదే కాలంరా బాబు అనుకుంటున్నారు జనాలు. 10 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చిరించిన విషయం తెలిసిందే. అయితే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.. వారం రోజులుగా ( అక్టోబర్ 8 వ తేదీ నాటికి) ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఏజెన్సీ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుంటే నగరంలో మాత్రం భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు..

Heat Wave Conditions Likely To Continue For Three Days In Ap | Visakhapatnam  News - Times of India

ఏజెన్సీలో చలి నుండి విముక్తి పొందేందుకు చలి మంటలు వేసుకుంటుంటే, నగరంలో మాత్రం భానుడి నుండి తప్పించుకునేందుకు ఏసీ లు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు..ఎండ వేడిమికి ఉక్కపోతకి,వేసవి తరహా వాతావరణం నెలకొనడంతో బయటకు వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం. 3 గంటల వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది.. వచ్చే వారం ఈశాన్య రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించవచ్చని వాతావరణ శాఖాధికారులు అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆ ప్రాంతంతో పాటు కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news