మన శరీరంలో కొన్ని అవయవాలు లేక పోయినా బతకచ్చట. చిన్న చిన్న అవయవాలు కొన్ని లేనప్పటికీ ఏ ప్రమాదం లేకుండా మామూలు గానే జీవించచ్చు. కానీ చాల మందికి వీటి గురించి తెలియదు. అయితే మరి ఈ ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా…? అయితే ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. అవయవాల విషయం లోకి వస్తే…. కొన్ని అవయవాలు లేకున్నా మనిషి బ్రతకడం సాధ్యం. ప్లీహం లేకపోయినా ఏమి కాదట.
కడుపులో ఎడమవైపు ప్లీహం ఉంటుంది. ఏదైనా గాయం దీనికి కనుక అయితే తొలగిస్తుంటారు. పక్కటెముకలకు బాగా దగ్గరగా ఉంటుంది ఇది. దీనిని తొలగించకపోతే ప్రాణానికి ప్రమాదం. అలాంటప్పుడు దీనిని తీసిన ఇబ్బంది ఉండదు. సాధారణం గానే జీవించొచ్చు. అపెండిక్స్ మంచి బ్యాక్టీరియా సప్లై చేస్తుంది. ఏమైనా ఇబ్బంది ఉంటె అపెండిక్స్ ను తీసేస్తారు . దీనితో మళ్లీ సమస్య వచ్చే ఛాన్స్ ఉండకూడదు అని.
క్యాన్సర్ లేదా ఏదైనా ట్రామా వచ్చినప్పుడు కూడా కడుపు భాగాన్ని తొలగిస్తుంటారు. ఇలా పొట్ట భాగం తొలగించినప్పుడు సర్జన్లు ఆ ప్రదేశంలో ఆసోఫగస్ ను చిన్న పేగులకు అడ్డంగా ఉంచుతారు. విటమిన్లు సరిగ్గా తీసుకుని రికవరీ అవడానికి వీలుంటుంది. అంతే కాదండి వృషణాలు, పిండాలు లేకుండా కూడా బతికేయొచ్చు. పెద్ద ప్రేగు, పిత్తాశయం, కిడ్నీ తొలగించిన బతకొచ్చు.
.