ఇలా బ్లాక్ హెడ్స్ ను సులువుగా తొలగించుకోండి..!

-

సాధారణంగా చాలా మంది బ్లాక్ హెడ్స్ తో సతమతమవుతూ ఉంటారు. పైగా అద్దంలో చూసుకో గానే ఎంతో చిరాకుగా అనిపిస్తుంది. వీటిని తొలగించడానికి మీరు చింతించక్కర్లేదు. సులువుగా ఈ నేచురల్ టిప్స్ ని అనుసరిస్తే తొలగిపోతాయి. మరి ఆ టిప్స్ ని ఇప్పుడే చూసేయండి.

నిమ్మ మరియు తేనె:

బ్లాక్ హెడ్స్ ను తొలగించడానికి నిమ్మ మరియు తేనె బాగా పని చేస్తాయి. దీని కోసం మీరు ముందుగా తేనే, నిమ్మ రసంను తీసుకుని కలపండి. దీనిని ముక్కు మీద అప్లై చేయండి. పదిహేను నిమిషాలు అలా వదిలేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి నాలుగు సార్లు చేయండి. నిమ్మ మరియు తేనె కలిపి ఇలా చేయడం వల్ల సులువుగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి .

ఎగ్ వైట్ మాస్క్:

దీనికోసం మీరు కోడిగుడ్లు తీసుకుని విస్క్ చేయండి. దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం యాడ్ చేయండి. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ మీద అప్లై చేయండి. పదిహేను నిమిషాల తర్వాత మరొకసారి అప్లై చేయండి. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోండి.

పంచదార:

దీనికోసం మీరు కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె తీసుకోండి. దీన్ని పంచదారలో కలపండి. బాగా కలిపిన తర్వాత బ్లాక్ హెడ్స్ మీద రాయండి. దానితో బాగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఇలా కూడా బ్లాక్ నెట్ ని తొలగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news