మీ జేబుకి చిల్లు పడకుండా మీ చర్మం మెరిసిపోవడానికి పాటించాల్సిన చిట్కాలు..

-

నిగనిగలాడే చర్మం కోసం అందరూ తపిస్తుంటారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చర్మం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఐతే చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారిపోవడం, పగుళ్ళు ఏర్పడటం మొదలగునవన్నీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమస్యల నుండి కాపాడుకోవడానికి మార్కెట్లో చాలా సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. కొన్ని సాధనాలు చాలా ఎక్కువ ఖరీదు ఉండి మీ జేబుకి చిల్లు పడేలా చేస్తాయి. అలా కాకుండా మనకు తెలిసిన వాటిలో ఖరీదు లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం..

చెమట చిందించాలి

మార్నింగ్ వాక్ శరీరానికే కాదు చర్మ సంరక్షణకి చాలా ఉపయోగపడుతుంది. చెమట చిందిస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగయ్యి, ఆక్సిజన్ ని తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే లక్షణాలని కనిపించకుండా చేస్తుంది.

తగినంతగా నీళ్ళూ తాగాలి

శరీరం నిస్సత్తువగా అనిపించినపుడు నీటిశాతం తగ్గిందన్నట్టు లెక్క. దానివల్ల చర్మం పొడిబారి అందవిహీనంగా మారుతుంది. రోజులో కనీసం 4-5లీటర్ల నీళ్ళు తాగాలి. దీనివల్ల చర్మం తేమగా మారుతుంది.

చక్కెర తగ్గింపు

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ కారణంగా బాక్టియాతో పోరాడే ఇమ్యూనిటి శక్తి తగ్గుతుంది. అందుకే ఏ రకంగానైనా చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. కాఫీ, టీ వంటి వాటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

సమయపాలన

చర్మానికి సంబంధించినది ఏదైనా సరైన సమయానికి చేయాలి. బయటకి వెళ్తున్న ప్రతీసారి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. విటమిన్ సి కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి. అలాగే వయసు పెరిగే లక్షణాలు తొందరగా రాకుండా కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news