చర్మ సంరక్షణకి సొరకాయ చేసే మేలు తెలుసుకోవాల్సిందే..

-

కాలం మారినప్పుడల్లా చర్మ సంరక్షణ చర్యలు మార్చుకోవాల్సిందే. కాలంలో మార్పులు చర్మం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ గా ఉండాలి. లేదంటే చర్మం ఇబ్బందుల పాలవడం ఖాయం.ఈ వేసవిలో చర్మం ఎక్కువగా ఎదుర్కునే సమస్యల్లో మొదటికి చికాకు. అవును, వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక చెమట వచ్చి చికాకు కలుగుతుంది. తద్వారా దురద మొదలగు సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి బారి నుండి కాపాడుకోవడానికి సొరకాయ చాలా ఉపయోగపడుతుంది.

వేసవిలో ఎదురయ్యే చర్మ సమ్సస్యలను అధిక శాతం నీరు కలిగిన సొరకాయ తినడం వల్ల తగ్గించుకోవచ్చు. ఇందులో 14శాతం సి విటమిన్, 2శాతం కాల్షియం, 1శాతం ఐరన్, 2శాతం మెగ్నీషియం ఉంటుంది. సొరకాయ తొక్కలో కూడా పోషకాలుంటాయన్న విషయం మర్చిపోకూడదు. కూర వండేటపుడు పారేసే ఈ తొక్కలో చర్మ రక్షణని కలిగించే పోషకాలు ఉన్నాయని గుర్తించండి. అలాంటి కొన్ని చర్మ రక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం కాలిపోయి మంట మండుతున్నప్పుడు సొరకాయ తొక్కని దాని మీద రాయాలి. ఇది ఆ మంట నుండి ఉపశమనం అందిస్తుంది. అరికాళ్ళు ముఖ్యంగా పాదాలు వేడిగా మారుతున్నాయని మీరు గ్రహించినపుడు సొరకాయ తొక్కలని వాటి మీద రాస్తే మంచి రిలాక్స్ ఫీల్ కలుగుతుంది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా వస్తుంది కాబట్టి, ముఖాన్ని ఎక్కువ సార్లు శుభ్రపర్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో రుబ్బిన సొరకాయ తొక్కలతో పేస్ట్ తయారు చేసుకుని, ముఖానికి మర్దన చేసుకుంటే బాగుంటుంది. ముఖంపై వచ్చే చర్మం వలన కలిగే చిరాకుని అది దూరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news