ట్రెండింగ్ : మోడీ-షాలు వచ్చి ప్రచారం చేయాలంటూ డీఎంకే అభ్యర్దుల ట్వీట్లు..

Join Our Community
follow manalokam on social media

డీఎంకే అభ్యర్థుల ట్వీట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వాళ్ళు వెరైటీ విన్నపాలు చేస్తున్నారు. మా గెలుపు మీ చేతుల్లోనే ఉందని, మా నియోజకవర్గాల్లో మీరు ప్రచారం చేయాలని వారు సోషల్ మీడియా వేదికగా మోడీ-షాలను కోరుతున్నారు. మీరు ప్రచారం చేస్తే మేము గెలుస్తామని సెటైరికల్ గా వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. మరో పక్క మోదీ-షాల మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ కూడా కలకలం రేపుతున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మోదీ టార్చర్, ఒత్తిడి తట్టుకోలేక అప్పటి కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్,అరుణ్ జైట్లీ చనిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగానే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించారని ఆయన ఆరోపించారు.  .

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...