మీరు చేసే ఏ పొరపాట్లు మిమ్మల్ని ఎక్కువ వయసు వారిగా కనిపిస్తాయో తెలుసుకోండి.

వృద్ధాప్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. కాలంతో పాటు అందరూ ముసలివాళ్ళలా మారిపోవాల్సిందే. కానీ వయసుకి మించిన వృద్ధాప్యం అనేది తప్పించగలిగేది. మీరు మీ వయసు కన్నా ఎక్కువ వయసు వారిలా కనిపించడమనేది చర్చించాల్సిన అంశం. ఇలా జరగడానికి చాలా కారణాలున్నాయి. అందుకే మీరు చేసే ఏ పొరపాట్లు మిమ్మల్ని వృద్ధులుగా కనిపించేలా చేస్తున్నాయో తెలుసుకుందాం.

ఆల్కహాల్ సేవనం

ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోయి చర్మం మీద ప్రభావం చూపుతుంది. నిర్జీవమైన చర్మం కారణంగా వయసు ఎక్కువ ఉన్నవారిగా కనిపిస్తారు. ముఖంపై ముడుతలు, కళ్ళ కింద క్యారీబ్యాగులు రావడానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుంది.

ఎలక్ట్రానిక్ పరికరాల తెరల వినియోగం పెరగడం

మహమ్మారి వల్ల పనులన్నీ ఆన్ లైన్లోనే జరుగుతున్నాయి. భౌతికంగా కలుసుకునే వీలు లేకపోవడం వల్ల మీటింగులన్నీ కంప్యూటర్ తెరల ముందే అవుతున్నాయి. దీనివల్ల కళ్ళమీద, చర్మం మీద ప్రభావం పడి ఎక్కువ వయసుగల వారిగా కనిపిస్తాం.

నీళ్ళు ఎక్కువ తాగకపోవడం

శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగకపోవడం వల్ల వృద్ధ్యాప్యం మీద పడ్డట్టుగా కనిపిస్తారు. అలసట, బలహీనత, మలబద్దకం, చర్మ సమస్యలకి ఇది కారణంగా ఉంటుంది. నీళ్ళు అందక ముఖ చర్మం పొడిబారి, గీతలు ఏర్పడతాయి.

పొగ తాగడం

నికోటిన్ మూలంగా అనేక విష పదార్థాలు శరీరంలోకి చేరుకుంటాయి. అవి శరీరంపై ప్రభావం చూపుతాయి. చర్మ కణాలను ఆక్సిజన్ సరఫరాను తగ్గించి కొత్త చర్మ కణాలు తయారు కాకుండా చేస్తుంది.

చక్కెర ఎక్కువ తీసుకోవడం

చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి కొల్లాజెన్, ఎలాస్టిన్ అవసరం అవుతాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల వీటి పరిమాణం తగ్గుతుంది. అప్పుడు చర్మం పాడవుతుంది.