లిప్ స్టిక్ పెట్టుకునేటపుడు ఈ తప్పులు చేయకపోతే ఇంకా అందంగా కనిపిస్తారు.

లిప్ స్టిక్.. కొత్తగా మేకప్ వేసుకుంటున్నా, లేదా ఏళ్ళ తరబడి మేకప్ వేసుకునే అలావాటున్నా లిప్ స్టిక్ పెట్టుకోవడం దగ్గరే చాలా మంది తప్పులు వేస్తారు. మేకప్ అంతా పూర్తి చేసుకుని లిప్ స్టిక్ దగ్గరే మిస్టేక్ చేసి, ఇంకా అందంగా కనబడే అవకాశాన్ని కోల్పోతారు. మేకప్ కిట్ లో లిప్ స్టిక్ ఉంది కదా అని చెప్పి పెదాలకి అంటించుకోకూడదు. దానికంటూ సరైన సమయం కేటాయించాలి. అలా కేటాయించకుండా లిప్ స్టిక్ వేసుకునేటపుడు చేసే తప్పులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పగిలిన పెదాలపై డైరెక్టుగా లిప్ స్టిక్ అప్లై చేయకూడదు. మాయిశ్చరైజర్ పోయిన పెదాలపై లిప్ స్టిక్ సరిగ్గా పనిచేయదు. మాయిశ్చరైజ్ అయిన పెదాలకి లిప్ స్టిక్ బాగా అతుక్కుంటుంది. అంతేకాదు అందంగానూ కనిపిస్తుంది.

మీకు సరిపడే లిప్ స్టిక్ ఏదో మీరే నిర్ణయించుకోవాలి. అన్ని లిప్ స్టిక్ షేడ్స్ అందరికీ పనిచేయవు. నియాన్ టోన్స్, లైట్ షేడ్స్ వంటివి ఉదయం పూట బాగా పనిచేస్తాయి. రాత్రివేళలో డార్క్ షేడ్స్, బ్రైట్ షేడ్స్ బాగా పనిచేస్తాయి. అలాగే అవి ఎంతసేపు పెదాలపై ఉంటాయనేది తెలిసి లిప్ స్టిక్ పెట్టుకోండి.

లిప్ లైనర్ ఖచ్చితంగా వాడాలి. పెదాల బౌండరీ ఎక్కడ ఉందనేది లిప్ లైనర్ ద్వారా ఈజీగా అర్థం అవుతుంది. లిప్ లైన్ ని దాటి లిప్ స్టిక్ పెట్టుకుంటే గనక అది అందంగా కనిపించకుండా ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి విషయాలేవీ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు లిప్ స్టిక్ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉండదు.