చర్మ సంరక్షణ: మీ దినచర్యని మార్చమని చర్మం చెప్పే సంకేతాలు

-

కాలం మారుతున్నప్పుడల్లా చర్మంలో మార్పులు వస్తుంటాయి. కాలానికనుగుణంగా చర్మ సంరక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. లేదంటే, చర్మ ఆరోగ్యం చెడిపోయి, వయస్సు పెరిగినట్లుగా కనిపిస్తుంది. నల్లమచ్చలు, మొటిమలు ఒక పట్టాన తగ్గకపోవడానికి కారణం కూడా అదే. అయితే ప్రతీ కాలానికి ఒకే చర్మ సంరక్షణ చర్యలు సరికాదు. వేసవి కాలం ఒకలా, చలికాలం మరోలా, వర్షాకాలం ఇంకోలా చర్యలు తీసుకోవాల్సిందే. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోకపోతే చర్మం కొన్ని సంకేతాలని ఇస్తుంది. ఆ సంకేతాలేంటో, అవి కనిపించినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

చర్మం పగిలినట్లు కనిపించడం, ఎర్రగా మొటిమలు ఏర్పడటం వంటివి కనిపిస్తే, మీరు రోజు వాడే స్కిన్ కేర్ ప్రోడక్టుల్లో సల్ఫేట్ శాతం పెరిగిందని అర్థం. చర్మ సంరక్షణ సాధనాల్లో ఉండే సల్ఫేట్ కారణంగా చర్మం ఇబ్బందులకి గురవుతుంది. దీని నుండి బయటపడాలంటే, సల్ఫేట్ ఉండే చర్మ సంరక్షణ సాధనాలను వాడడం మానుకోవాలి.

చర్మ సంరక్షణ సాధనాలు వాడుతున్నప్పటికీ, చర్మం పొడిబారిపోవడం, లేదా అంతకుముందు కంటే ఎక్కువ ఆయిల్ చర్మంపై పేరుకుపోవడం కనిపిస్తే, ఆ ప్రోడక్టుని వాడటం ఆపేయాలి. కొత్త ప్రోడక్టుని తీసుకుని డైలీ వాడకుండా, వారంలో రెండు సార్లు మాత్రమే అప్లై చేసుకోవాలి.

చలికాలానికి వాడే ప్రోడక్టులని వేసవి కాలానికి వాడాలని అస్సలు అనుకోవద్దు. చలికాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువ కావాలి. వేసవి కాలంలో అంత అవసరం ఉండదు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి కాబట్టి, వేడినీళ్ళతో ముఖం కడుక్కోవడమే ఉత్తమం.

వ్యక్తిగత శుభ్రత

ముఖం కడుక్కునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంతైనా అవసరం. మురికిగా ఉన్న చేతులతో ముఖాన్ని ముట్టుకుంటే అందులో ఉండే సూక్ష్మజీవుల కారణంగ చర్మం సమస్యలకి గురవుతుంది. అంతేకాదు బెడ్ పై వేసుకునే దిండు కవర్లని రెండు వారాలకి ఒకసారి మార్చుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news