ముఖంపై ముడతలను తొలగించాలంటే ఓట్స్‌ను ఇలా వాడండి

-

డైట్‌ చేయాలి అనుకునేవాళ్లు మెయిన్‌గా తినే ఆహారంలో ఓట్స్‌ కచ్చితంగా ఉంటాయి. ఓట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు కూడా చెప్పారు. ఓట్స్‌ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖంపై ముడతలను తగ్గించేందుకు ఓట్స్‌ ఉపయోగపడతాయట. ఓట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్‌లో విటమిన్ ఇ కూడా ఉంది, ఇది చర్మ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. అవి చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి మరియు పొడి చర్మాన్ని నిరోధించడానికి సహాయపడే ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. చర్మాన్ని కాపాడుకోవడానికి ఓట్స్‌తో తయారుచేసే కొన్ని ఫేస్ ప్యాక్‌లను తెలుసుకుందాం.
ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పాలు ఒక టీస్పూన్ ఓట్ మీల్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ముడతలు, గీతలు మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.
గోరువెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, బేకింగ్ సోడా కలిపి స్నానం చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
పండిన బొప్పాయి గుజ్జు తీసుకోండి. ఇప్పుడు దానికి రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ మరియు ఒక టీస్పూన్ బాదం నూనె వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖం మరియు మెడపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ ముడతలను నివారించి, ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.
అలోవెరా జెల్ మరియు రెండు టీస్పూన్ల ఓట్ మీల్ వేసి కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి.
ఇలా ఓట్స్‌తో ఫేస్‌ ప్యాక్‌ వేయడం వల్ల ముఖంపై మచ్చలు, ముడతలు తగ్గుతాయి. అయితే ఈ ఫేస్‌ ప్యాక్‌ అందరికీ ఒకేలాంటి ఫలితాలు ఇస్తుందని కచ్చితంగా చెప్పలేం. కొందరికి ఓట్స్‌ ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖంతెల్లగా మారొచ్చు, మరికొందరికి ఇంకా నల్లగా అవ్వొచ్చు. కాబట్టి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకుని ట్రై చేయడం బెటర్‌.

Read more RELATED
Recommended to you

Latest news