గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల విషయంలో విచిత్ర వాదన లేవనెత్తుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ అన్నారు. ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంకు అకౌంట్ 3,500 కోట్లు ఉండేవి అని తెలిపారు.
2014కు ముందు ఏ ఒక్క సారి కూడా ఉద్యోగులకు జీతాలు లేట్ చేయలేదు. కేసీఆర్ పాలన వల్ల సింగరేణిని అప్పుల పాలు చేశారు. సింగరేణి దేశంలోనే మంచి ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటిగా నిలిచింది. సింగరేణి చెల్లించాల్సిన బిల్లులు నేడు సకాలంలో చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. మార్చి 31 నాటికి తెలంగాణ 8వేల 56 కోట్లు బాకీ ఉందని తెలిపారు కిషన్ రెడ్డి. అదేవిధంగా 30వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సి ఉంది. ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. లోపభూఇస్టాల విధానం ద్వారానే ఈ పరిస్థితి నెలకొంది. సింగరేణికి అన్యాయం చేస్తున్నారు. బొగ్గు, విద్యుత్ బకాయిలు 30వేల కోట్లు పేరుకుపోయాయన్నారు.