మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోని ఏం చేస్తాము ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటారు..అలాంటి వారి కోసం చక్కటి బిజినెస్ ఐడియా ఉంది. అదే స్నాక్స్ బిజినెస్ ఐడియా..కేవలం మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ ను చేయవచ్చు.. లక్షల్లో ఆదాయం పొందాలని అనుకుంటే ఎటువంటి వంటలను చెయ్యాలి..ఎలా మార్కెట్ చెయ్యాలి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎంత క్వాలిటీ, రుచి మెయింటేన్ చేస్తే మీకు అన్ని డబ్బులు రావడం గ్యారెంటీ. ఈ బిజినెస్ ను తక్కువ పెట్టుబడి, తక్కువ మ్యాన్ పవర్, తక్కువ స్థలంలోనూ ప్రారంభించగలగడం మరో విశేషంగా చెప్పొచ్చు. ఈ వ్యాపారాన్ని గ్రామం, నగరం లాంటి తేడా లేకుండా ఎక్కడైనా ప్రారంభించగలగొచ్చు. అయితే.. మార్కెటింగ్ చేయడంపై మీకు వచ్చే ఆర్డర్లు, లాభాలు ఆధారపడి ఉంటాయి..
మీరు బాగా వంట చేస్తె మీరు చేసుకోవచ్చు లేదా మనుషులను పెట్టడం మేలు..అయితే కొంచెం పెద్దగా ఈ బిజినెస్ ను ప్రారంభించాలనుకుంటే మాత్రం వివిధ రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్ మరియు GST రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉన్నాయి.
ఇంకా ఈ వ్యాపారం ప్రాంభించడానికి ముందు అన్ని రకాల పిండి, నూనె, శనగపిండి, ఉప్పు, నూనె, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు మీకు అవసరం. వంట మిషనరీ తో పాటు ప్యాకేజింగ్ మరియు వెయింగ్ మెషిన్ మొదలైన కొన్ని యంత్రాలు అవసరం. దీనితో పాటు, మీకు 1-2 మంది ఉద్యోగులు కూడా అవసరం..కొంచెం పెద్ద స్థాయిలో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా అనుకుంటే కనీసం 2 నుండి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీ వ్యాపారం సక్సెస్ అయితే.. మీకు 20 నుండి 30 శాతం వరకు లాభాలు వస్తాయి.దానికి మీరు ముందుగానే ప్లాను చేసుకోవడం మంచిది..నెలకు లక్ష వరకూ ఆదాయం పొందవచ్చు..