బిజినెస్ ఐడియా: ముత్యాలు పండిస్తూ రూ. లక్షలు సంపాదన..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా…? దాని నుండి లక్షల్లో ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టీచర్ చేస్తున్న బిజినెస్ ని మీరు చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగాలని కాదనుకొని వ్యాపారాలని చేస్తున్నారు కావాలనుకుంటే ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారాలను చేసుకోవచ్చు. ఈ టీచర్ ముత్యాల సాగు ద్వారా లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో లక్షల రూపాయలు లాభం పొందడం నిజంగా గొప్ప విషయం కదా..?

చాలా మంది ముత్యాలని తయారు చేయడానికి నల్లనత్తలని, నత్తగుల్లలని ఉపయోగిస్తూ ఉంటారు. ముత్యాల చిప్ప లోపలి పొరల్లో ఏర్పడే రసాయనల చర్యల వలన ముత్యం వస్తుంది. కొంచెం చోటు ఉన్నచోట ముత్యాలని పండించచ్చు. లేదంటే రైతులు పొలాల్లో పండించొచ్చు. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రజా మహమ్మద్ కూడా ముత్యాల సాగు చేస్తున్నారు కరోనా సమయంలో ఉపాధి కోల్పోవడం వలన ముత్యాల సాగుని మొదలుపెట్టారు.

ఆల్చిప్పల నుండి ముత్యాల సాగు చేస్తున్నారు. ఈ ముత్యాల సాగు కోసం 15 నుండి 20 నెలల సమయం పడుతుంది. అయితే ఒక్కొక్కసారి ఆల్చిప్పలు పాడవుతుంటాయి చూసుకోవాలి. కానీ నిజానికి మంచి ముత్యాలు కనుక వచ్చాయి అంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా తన ముత్యాల సాగు ని మొదలుపెట్టి.. ఇప్పుడు అదిరే లాభాలని పొందుతున్నారు రజా. ఒక బ్యాచ్ ద్వారా రెండు నుండి మూడు లక్షలు వస్తున్నాయి. మీరు కూడా ఈ వ్యాపారం చేయాలనుకుంటే ముత్యాల పెంపకం పై ప్రభుత్వము ఇచ్చే శిక్షణని తీసుకోవచ్చు. లోన్ సదుపాయం కూడా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news