బిజినెస్ ఐడియా: పచ్చళ్ళ వ్యాపారంతో అదిరే లాభాలు పొందొచ్చు…!

-

ఈమధ్యకాలంలో ఎక్కువమంది వ్యాపారం పై మక్కువ చూపిస్తున్నారు. ఉద్యోగాల కంటే వ్యాపారమే మంచిదని నచ్చిన వ్యాపారాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే మీరు కూడా ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా…? ఆ వ్యాపారం తో అదిరిపోయే లాభాలని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని మీరు ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బందులు రావు. అయితే మరి ఇక ఆ బిజినెస్ ఐడియాస్ గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.

 

తక్కువ పెట్టుబడి తో పచ్చళ్ళు వ్యాపారం మొదలు పెడితే మంచిగా లాభాలు పొందొచ్చు. పైగా దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే ప్రారంభించొచ్చు. ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. కేవలం 10 వేల రూపాయలు ఉంటే ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ రుణ పథకాలు సహకారంతో మీరు దీన్ని మరింత విస్తరించుకోవచ్చు. ముద్ర లోన్ కూడా ఈ బిజినెస్ చేయడానికి పొందొచ్చు.

అయితే పచ్చళ్ల వ్యాపారం చేయాలంటే మీరు క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అలాగే రుచి కూడా బాగుండాలి. ప్యాకింగ్ పద్ధతి కూడా సరిగ్గా ఉండాలి. వీటినన్నింటినీ మీరు సరిగ్గా చూసుకుంటే మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆన్లైన్ లో కూడా మీరు పచ్చళ్ళని అమ్మచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ ప్లేట్ ఫామ్స్ లో కొనేవారు ఎక్కువ మంది ఉంటారు.

కాబట్టి అలా కూడా మీరు అమ్మొచ్చు. వివిధ రకాల పచ్చళ్లు పెట్టి వాటిని మీరు సేల్ చేస్తే మంచిగా లాభాలు వస్తాయి. అయితే పచ్చళ్ళు వ్యాపారం పెట్టాలంటే సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ కూడా ఉండాలి. ఈ లైసెన్స్ కోసం మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఈ వ్యాపారం తో నెలకు 30000 వరకు ఆదాయం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news