కిమ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నవ్వడంపై నిషేధం..

ప్రపంచ దేశాధి నేత‌లంతా ఓ దారి లో వెళుతుంటే.. ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌.. మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. కిమ్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. అది సంచ‌ల‌నంగా మారుతుంది. ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుంటూ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రుస్తూ ఉంటారు. అయితే.. తాజాగా ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న‌వ్వ‌డంపై నిషేధాన్ని విధించింది. ఇవాళ్టి నుంచి ఈ ఆదేశాలు అమ‌లులోకి వ‌చ్చాయి.

కేవ‌లం న‌వ్వ‌డం పై మాత్ర‌మే కాదు మ‌ద్యం సేవించ‌డం, స‌రుకులు కొనేందుకు షాపింగ్ కు వెళ్ల‌డం, విశ్రాంతి కార్య‌క్ర‌మాల్లో… పాల్గొన‌డంపై కూడా నిషేధం విధించారు. ఇవాళ్టి నుంచి 10 రోజుల పాటు ఈ ఆదేశాలు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు.. తెలిపింది కిమ్ స‌ర్కార్‌. దీనిని ఎవ‌రైనా ఉల్లంఘిస్తే.. ప‌రిణామాలు ఉంటాయ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దీనికి ముఖ్య కార‌ణం.. ఆ దేశ మాజీ దేశాధ్య‌క్షుడు.. కిమ్ జాంగ్ 2… ఆయ‌న భౌతికంగా దూరంగా ఉండి 10 ఏళ్లు గ‌డిచింది. ఆయ‌న 10 వ‌ర్ధంతి సంద‌ర్ఢంగా 10 రోజుల పాటు న‌వ్వ‌కుండా నిషేధం విధించారు.