ఢిల్లీలో కొత్తగా 10 ఓమిక్రాన్ కేసులు.. దేశంలో 98కి చేరిన కేసుల సంఖ్య

దేశంలో ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేగంగా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారికే ఓమిక్రాన్ వేరియంట్ సోకుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, ఐర్లాండ్, కెన్యా, సోమాలియా, చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చిన వారికే ఓమిక్రాన్ వేరియంట్లు సోకాయి. తాజాగా ఢిల్లీలో కొత్తగా మరో 10 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు తెలంగాణలో 1 కేసు నమోదైంది. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే … మొత్తం 98 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటి వరకు దేశంలో మహారాష్ట్రలో 32 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా… రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 20, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, కేరళలో 5, గుజరాత్ లో 5, తమిళనాడు, ఏపీ, చంఢీగడ్, వెస్ట్ బెంగాల్ లలో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ కేసులు ప్రస్తుతం 90కి పైగా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యూరప్ దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా యూకేలో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి.