బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడితో అదిరే లాభాలు..!

-

వ్యాపారం చేయాలని అనుకునే వాళ్ళకి కొన్ని బిజినెస్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో మంచి రాబడి పొందాలనుకునే వాళ్ళకి ఈ ఐడియాస్ బాగుంటాయి.అయితే మరి 25 వేల రూపాయల కంటే తక్కువ పెట్టుబడి తో అదిరిపోయే లాభాలు పొందే బిజినెస్ ఐడియా Business Idea గురించి మనం ఇప్పుడు చూసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఎవరైనా సరే ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ చేయొచ్చు.

ఆన్లైన్ బెడ్ షీట్స్ బిజినెస్:

బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి బెడ్ షీట్స్ బిజినెస్ బాగుంటుంది. ఎక్కువ బెడ్ షీట్స్ ని తయారీదారుల నుంచి కొనుగోలు చేసి ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కువ కొనడం వల్ల తక్కువ డబ్బులకి మీకు బెడ్ షీట్స్ వస్తాయి.

దీనితో మీరు వ్యాపారం మొదలు పెట్టొచ్చు. పానిపట్, జైపూర్, ఢిల్లీ, సూరత్ లో ఎక్కువగా వీటిని తయారు చేస్తూ ఉంటారు. పైగా అక్కడ చాలా ప్రసిద్ధి కూడా. ఇలా మీరు బెడ్ షీట్స్ బిజినెస్ ప్రారంభించొచ్చు. ఆన్లైన్ ద్వారా మీరు మాన్యుఫాక్చర్ చేసే వారితో కాంటాక్ట్ అయ్యి తక్కువ రేట్ కి కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు.

అప్పడాలు:

తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఎక్కువ రాబడి అప్పడాల బిజినెస్ ద్వారా కూడా పొందొచ్చు మొదట మీరు సొంతంగా చిన్న బిజినెస్ ప్రారంభించి ఆ తర్వాత అప్పడాలు తయారు చేసే మాన్యుఫాక్చర్స్ తో మీరు వ్యాపారం చేయొచ్చు.

బియ్యం అప్పడాలు, మినప్పప్పు అప్పడాలు, పెసరపప్పు అప్పడాలు, బంగాళదుంప అప్పడాలు ఇలా రకరకాలు తయారుచేసి అమ్మొచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా మీరు వీటిని సేల్ చేయవచ్చు.

మసాలా పొడి:

ప్రపంచవ్యాప్తంగా మసాలాదినుసులుని, పౌడర్లు ని వాడుతూ ఉంటారు. గరం మసాలా, జీరా మసాలా వంటివి తయారు చేసుకోవచ్చు.

మసాలా పొడుల బిజినెస్ చేయడం వల్ల మీరు మంచి రాబడి పొందొచ్చు చాలా మంది ఈ బిజినెస్ చేస్తున్నారు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఈ బిజినెస్ చేయొచ్చు ఇలా కూడా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news