మగాళ్లకోసమే సమాజం సృష్టించుకున్నారు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

-

సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. “మన సమాజం నిర్మాణం మగాళ్ల కోసం మగవాళ్లు సృష్టించుకుందని పేర్కొంది. ఆర్మీ పర్మినెంట్ కమిషన్‌లో మహిళా కమాండోలకు చోటుకల్పించాలని గతేడాది సెప్టెంబరులో కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం వైఖరి పై సుప్రీంకోర్టు మండిపడింది.

పర్మినెంట్ కమిషన్‌లో చేరడానికి మహిళలకు మెడికల్ ఫిట్‌నెస్ అవసరమని చెప్పడం దారుణమైన కారణమని పేర్కొంది. గతంలో మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ (పిసి) మంజూరు చేయాలని, ఒక నెలలో గా, తగిన ప్రక్రియను అనుసరించి 2 నెలల్లోపు పిసిని అనుమతించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశించింది. ‘‘మన సమాజం నిర్మాణం మగాళ్ల కోసం మగవాళ్లు సృష్టించుకుందని ఇక్కడ గుర్తుంచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news