బిజినెస్ ఐడియా: గోరింటాకు వ్యాపారంతో లాభాలే లాభాలే..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని చేయాలనుకుంటున్నారా…? ఆ వ్యాపారం తో అదిరిపోయే లాభాలను పొందాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ని కనుక మీరు చేస్తే మంచి లాభాలు వస్తాయి. పైగా ఎక్కువ పెట్టుబడి కూడా దీని కోసం మీరు పెట్టక్కర్లేదు. అదే గోరింటాకు బిజినెస్. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…

గోరింటాకు వ్యాపారంతో మంచిగా లాభాలను పొందవచ్చు. గోరింటాకుకి డిమాండ్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. మన దక్షిణ భారత దేశంలో ఎక్కువగా సాగు చేసే పంటలు లో ఈ గోరింటాకు కూడా ఒకటి అని చెప్పవచ్చు. తక్కువ వర్షపాతం పడే ప్రాంతం లో పండే పంటల్లో గోరింటాకు కూడా వుంది. ఈ పంట ఎక్కువగా ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు.

మీరు గోరింటాకు మొక్కల్ని తెచ్చి నాటొచ్చు లేదు అంటే విత్తనాలు అయినా వెయ్యొచ్చు. ఆ తర్వాత రెండో సంవత్సరం నుండి ఆకులు కోతకు వస్తాయి. 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఈ మొక్కలు లైఫ్ టైం ఉంటుంది. గోరింటాకుని సుగంధ ద్రవ్యాలను చేయడానికి లేపనాలను తయారు చేయడానికి కూడా వాడతారు.

కాస్మటిక్ రంగంలో గోరింటాకు కి ఎంత ప్రత్యేకత ఉందో మనం చెప్పక్కర్లేదు మీకు తెలిసే ఉంటుంది. పైగా ఆయుర్వేదంలో కూడా గోరింటాకుని వాడతారు. అలానే హెయిర్ కండీషనర్ కింద కూడా దీనిని వాడుతూ ఉంటారు. ఆయింట్మెంట్స్ లో కూడా గోరింటాకుని వాడతారు ఎలా చూసుకున్నా చాలా బెనిఫిట్స్ దీని వల్ల ఉన్నాయి కనుక మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ పంట వేయడానికి మీకు కొంచెం పొలం అవసరం పడుతుంది. ఆ తర్వాత మీరు మంచిగా సాగు ఈ చేసి అదిరే లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news