ఓర్ని ఏకంగా వైన్ తోనే కారును నడిపిస్తున్న ప్రిన్స్ ఛార్లెస్.. ఇదెక్కడి మాస్ రా మావా అంటున్న నెటిజన్లు..!

-

ఇప్పటివరకు పెట్రోల్ లేదా డీజిల్ అదికాదంటే సీఎన్ జీ గ్యాస్ తో నడిచే వాహనాలను మనం చూసి ఉంటాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఎలక్ట్రిక్ వాహనాలు. చార్జ్ పెడితే వెళ్తుంది. కానీ వైన్ తాగేకారు గురించి మీరెప్పుడైనా విన్నారా. ఆ కారు వైన్ తాగుతుందట. వెన్ ఒక్కటేనా ఏంటి విస్కీ, ఛీజ్ అన్నీ కలిపికొట్టేస్తుంది. డ్రంక్ డ్రైవ్ అంటే డ్రైవర్ మందుతాగి డ్రైవింగ్ చేయటం కానీ..ఇప్పుడు కారే డ్రింక్ చేసే డ్రైవ్ చేస్తే..దీన్ని ఏమనాలో. అసలు ఈ కారేంటి..ఎందుకు ఇలా వైన్ తాగుతుంది..దీనివెనుక ఉన్న మిస్టరి ఇప్పుడు తెలుసుకుందాం.

వాతావరణ కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని వివిధ దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే బ్రిటీష్ రాజవంశానికి కాబోయే చక్రవర్తి ప్రిన్స్ ఛార్లెస్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పెట్రోల్-డీజిల్-సీఎన్‌జీ-ఎలక్ట్రిక్‌ బదులు.. వైన్‌తో కారు నడిపిస్తున్నారు.

ప్రిన్స్ ఛార్లెస్ 21వ పుట్టినరోజు సందర్భంగా అందుకున్న ఆస్టన్ మార్టిన్ కారుపై ఇప్పటికీ మోజు తగ్గలేదు. ఆయన ప్రాంగణంలో ఎన్నికార్లు వచ్చినా ఆస్టన్ మార్టిన్ కారు వన్నె ఏ మాత్రం తగ్గలేదు. అందుకే ఆ కారునే ఎక్కువగా వినియోగిస్తుంటారు ప్రిన్స్ ఛార్లెస్. ఛార్లెస్ కారుని ఇంజనీర్లతో రీ డిజైన్ చేయించారు. ఇంజనీర్ల కృషి ఫలితంగా… ఆ కారు ఇప్పుడు ఏకంగా వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్ ప్యాలేస్‌లో మిగిలిపోయిన వైన్‌తో ఈ కారును నడుపుతున్నారు.కొన్ని సందర్భంగాల్లో అయితే విరిగిన పాలను కూడా ఇంధనంగా వాడుతున్నారు.

ఈ విషయాల్ని స్వయంగా ప్రిన్స్ ఛార్లెస్ వివరించడం విశేషం. వాతావరణ కాలుష్యంపై ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నా సరే ఛార్లెస్ స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల్ని చెరిపేసేందుకే ప్రిన్స్ ఛార్లెస్ ఈ వైన్ కారును ఎంచుకున్నారు. కర్బన ఉద్గారాల్ని వెదజల్లని వైన్ కారును ప్రొమోట్ చేసుకుంటున్నారు. వైన్ పోస్తే చాలు ఈ కారు సర్రున దూసుకుపోతోంది. ఈ ఆలోచనపై గ్లోబల్ లీడర్స్ నుంచి పెద్దగా స్పందన రాలేదు..కానీ రాజుగారిపై సోషల్ మీడియాలో మీమ్స్ అయితే ఓ రేంజ్ లో వచ్చాయి. రాజకుంటంబం అంటే ఆ రేంజ్ వేరుమరి అన్నట్లు వైన్ తో నే కారును నడిపిస్తూన్నాడు ప్రిన్స్ ఛార్లెస్.

                                                                                                – Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news