యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఆదాయం ఎలా వ‌స్తుంది ? అర్హ‌త‌లు ఏమిటి ?

-

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో డ‌బ్బులు సంపాదించాలంటే ఉద్యోగాలు చేయాల్సిన ప‌నిలేదు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ ఒక‌టి. యూట్యూబ్‌లో చాన‌ళ్ల‌ను క్రియేట్ చేసి వాటిల్లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చే విష‌యం అందరికీ తెలుసు. అయితే ఆదాయం ఎలా వ‌స్తుంది ? ఎన్ని వ్యూస్‌కు ఎంత ఆదాయం వ‌స్తుంది ? అస‌లు ఆదాయం పొందాలన్నా, యాడ్‌సెన్స్ ఓకే కావాల‌న్నా.. అందుకు ఏమేం అర్హ‌లు ఉండాలి ? అంటే..

how revenue comes from youtube channel

యూట్యూబ్‌లో మీ చాన‌ల్‌కు 1000 మంది సబ్‌స్క్రైబ‌ర్లు ఉండాలి. అలాగే మీరు మీ చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోల‌కు వాచ్ టైం.. అంటే వీక్షించిన స‌మ‌యం 4000 గంట‌లు ఉండాలి. ఇలా ఉంటే వెంట‌నే యాడ్‌సెన్స్ ఓకే అవుతుంది. త‌రువాత మీ వీడియోల‌కు ఆటోమేటిగ్గా యాడ్స్ క‌నిపిస్తాయి. అయితే 12 నెల‌ల్లోగా 1000 మంది సబ్‌స్క్రైబ‌ర్ల‌ను, 4000 గంట‌ల వాచ్‌టైంను సాధించాల్సి ఉంటుంది.

ఇక యూట్యూబ్ ద్వారా వ‌చ్చే ఆదాయం సీపీఎం (CPM) అంటే.. Cost Per Mille మీద ఆధార ప‌డుతుంది. అంటే.. మీ చాన‌ల్‌లో ఏదైనా ఒక వీడియోకు 1000 యాడ్స్ డిస్‌ప్లే అయ్యాయ‌నుకుంటే.. వాటి స‌రాస‌రి మొత్తాన్ని CPM అంటారు. ఇందులో వ‌చ్చే ఆదాయం యూట్యూబ్ 45 శాతం తీసుకుంటుంది. 55 శాతం మీకు ఇస్తుంది. ఇలా యూట్యూబ్‌లో ఆదాయం వ‌స్తుంది. ఏదైనా వీడియోకు ఎన్ని వ్యూస్ వ‌చ్చాయ‌నే విషయాన్ని బ‌ట్టి కాకుండా దానికి ఎన్ని యాడ్స్ డిస్‌ప్లే అయ్యాయి ? అనే అంశంపై ఆదాయం ఆధార‌ప‌డి ఉంటుంది. దాన్ని బ‌ట్టే యూట్యూబ్ మ‌న‌కు ఆదాయం ఇస్తుంది.

ఇక యూట్యూబ్ ద్వారా వ‌చ్చే ఆదాయం 10 డాల‌ర్లు కాగానే మీ చిరునామా ధ్రువీక‌ర‌ణ కోసం 6 అంకెల పిన్‌ను పంపిస్తారు. దాన్ని యాడ్‌సెన్స్ అకౌంట్‌లో యాడ్ చేయ‌గానే మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. అనంత‌రం పేమెంట్స్ విభాగంలో బ్యాంక్ ఖాతా వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి. ఈ క్ర‌మంలో యాడ్‌సెన్స్ ద్వారా 100 డాల‌ర్లు కాగానే త‌దుప‌రి నెల 11వ తేదీ త‌రువాత పేమెంట్ అంద‌జేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news