బిజినెస్ ఐడియా: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం..ఎలాగంటే?

-

ఈరోజుల్లో ఉద్యోగాలు చేసి చాలిచాలని జీతాలతో బిజిగా గడపడం కన్నా కూడా సొంతంగా చిన్న వ్యాపారం చేసుకొని లక్షలు సంపాదిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగి పోతుంది..అందుకే చాలా మంది యువత బిజినెస్‌పై దృష్టిసారిస్తున్నారు. డబ్బు లేకున్నా.. లోన్ తీసుకొని అయినా.. వ్యాపారం చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు పౌల్ట్రీ ఫామ్ బిజినెస్ చక్కటి అవకాశం. దీనికి రోజుకు 4 గంటలు కేటాయిస్తే చాలు. ఆ తర్వాత ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. పెట్టుబడి కాస్త ఎక్కువగా ఉన్నా ఇబ్బందేం లేదు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి.

10 లక్షలు పెట్టుబడి అయితే తప్పనిసరిగా పెట్టాలి.షెడ్డు గోడలు, ఐరన్ మెష్, ఇతర సామాగ్రి మొత్తం ఇందులోనే వస్తాయి. ఏదో ఊరికి దూరంగా పొలాల్లో నిర్మించుకుంటే ఉపయోగం ఉండదు. రోడ్డు సౌకర్యం ఉన్నచోటే పౌల్ట్రీ షెడ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. షెడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత మీరు ఏదేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. వెన్‌కాబ్, సుగుణ, స్నేహ వంటి పౌల్ట్రీ కంపెనీలతో అగ్రీమెంట్ చేసుకోవచ్చు. సదరు కంపెనీ వారే మీకు బ్రాయిలర్ కోడి పిల్లలు ఇస్తారు. రవాణా ఖర్చులు కూడా వారివే. ఆ తర్వాత వాటికి అవసరమైన దాణా, రోగాల బారినపడకుండా ఇంజెక్షన్స్ కూడా వారే సప్లై చేస్తారు. మీరు కేవలం వాటిని పెంచి.. ఇవ్వాల్సి ఉంటుంది. అలా పెంచినందుకు.. కమిషన్ ఇస్తారు. కోళ్లు ఒక సైజుకు వచ్చిన తర్వాత,ఆయా కంపెనీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి కోళ్లను తీసుకెళతారు.

10 వేల సామర్థ్యంతో పౌల్ట్రీ ఫామ్ పెట్టారని అనుకుందాం. దాదాపు 45 రోజులకు బ్యాచ్ పూర్తవుతుంది. కోళ్లు ఒకటిన్నర నుంచి రెండు కేజీల బరువు పెరుగుతాయి. ఎలాంటి మోర్టాలిటీ లేకుండా అన్ని బతికి.. ఒక్కొక్కటి 2 కేజీల చొప్పున పెరిగాయని భావిస్తే.. అప్పుడు మీ షెడ్‌లో ఉన్న మొత్తం కోళ్ల బరువు 20వేల కేజీలు. కంపెనీ వారు ఒక్కొ కేజీకి రూ.3 చొప్పున కమిషన్ చెల్లిస్తే.. మీకు రూ.60వేలు వస్తాయి. ఖర్చులకు రూ.10 వేలు పోయినా.. రూ.50వేలు మిగులుతాయి. కొన్ని కంపెనీలు రూ.4 కూడా ఇస్తాయి. అప్పుడు బ్యాచ్‌కు రూ.80 వేల వరకు వస్తాయి..అన్నీ ఖర్చులు పోగా మీకు 50 వేలు మిగులుతాయి..కంపెనీతో కాకుండా మీరే సొంతంగా వ్యాపారం చేస్తె ఇంకా మంచి లాభాలను పొందవచ్చు.. ఇలాంటి ఆలోచన ఉంటే మీరు కూడా మొదలు పెట్టి లాభాలను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news