మరో దారుణం.. యువతిని లాకెళ్లి గ్యాంగ్‌ రేప్‌..

ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామంధుల వెన్నులో మాత్రం వణుకు రావడం లేదు. యథేచ్ఛగా దొరికిన యువతులపై, స్త్రీలపై ఆఖరి చిన్నా పెద్దా లేకుండా వారిపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజా మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ తరహా ఘటన ఛత్తీస్‌గఢ్ లో చోటు చేసుకుంది. ఛత్తీస్​గఢ్ ​లో ని సుర్గుజా అడవుల్లో ఓ యువతిపై నలుగురు కామాంధులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. అదే సమయంలో ఆమె భాగస్వామిపై కూడా దాడి చేశారు. ఆమెను, ఆమె భాగస్వామిని దారుణంగా కొట్టారు ఆ నలుగురు నిందితులు.

Rape Images – Browse 114,301 Stock Photos, Vectors, and Video | Adobe Stock

ఆ తర్వాత బాధితురాలి బ్యాగులో ఉంచిన డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సుర్గుజా పోలీసులు సమీప గ్రామాలపై దాడులు చేశారు. అదే సమయంలో పోలీసులను చూసిన ఓ అనుమానితుడు భయాందోళనకు గురయ్యాడు. బాధితురాలు అతడిని గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేవలం రెండు గంటల్లోనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్​ ఉన్నాడు. మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడిగా సంతోష్ యాదవ్​, మిగతా వారిని అభిషేక్​ యాదవ్​, నాగేంద్ర యాదవ్​గా గుర్తించారు పోలీసులు.