బిజినెస్ ఐడియా: పేపర్ గ్లాసుల బిజినెస్ తో అదిరే లాభాలు పొందొచ్చు…!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి రాబడి పొందొచ్చు. పైగా పెట్టుబడి కూడా తక్కువే. అదే పేపర్ గ్లాసుల బిజినెస్. ఈ బిజినెస్ తో చక్కటి లాభాలుని మీరు పొందొచ్చు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

Paper glass business

 

సొంతంగా మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఈ పేపర్ గ్లాసులు బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది. పైగా ఈ మధ్య కాలంలో చాలా మంది ప్లాస్టిక్ కి బదులుగా పేపర్ గ్లాసులని వాడడానికి ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం కూడా మీ వ్యాపారం మొదలు పెట్టడానికి సహకరిస్తుంది. ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ వంటివి అయినప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.

పైగా ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా పేపర్ కప్స్ ని వాడతారు కాబట్టి ఇది మీకు ప్లస్ అవుతుంది. ప్రభుత్వం ముద్ర లోన్స్ ని అందిస్తోంది. ముద్ర లోన్ లో భాగంగా ప్రభుత్వం 75% డబ్బులని ఇస్తుంది. కనుక ఏ చింతా లేకుండా మీరు లోన్ తీసుకుని వ్యాపారం మొదలు పెట్టొచ్చు. అయితే ఈ గ్లాసులని తయారు చేయడానికి మీకు మిషన్లు అవసరమవుతాయి.

ఢిల్లీ, హైదరాబాద్, ఆగ్ర మరియు అహ్మదాబాద్ లో ఈ మిషన్లు సులువుగా అందుబాటులో ఉంటాయి. మీరు చిన్నగా మీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే రెండు లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇలా మీరు అవసరమైనా రా మెటీరియల్స్ ని కొనుక్కొని మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. అదిరిపోయే లాభాలను కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news