రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు లక్ష ఆదాయం.. డిమాండ్‌ తగ్గని బిజినెస్..!!

-

ఇప్పుడు చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేయడమే సుఖం అనుకుంటున్నారు చాలామంది.. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల కంటే…మనమే ఒక బిజినెస్‌ పెట్టుకుందా.. మనకు మనమే బాస్‌.. భయం అక్కర్లేదు.. షిఫ్ట్‌లు అడ్జెస్మెంట్‌లు చేసుకోవక్కర్లేదు. ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ఎప్పుడైన రావొచ్చు. కానీ దేనికి ఉండే సమస్యలు దానికి ఉంటాయి అనుకోండి. మీరు కూడా ఏదైనా బిజినెస్‌ పెట్టాలని ఆలోచిస్తున్నట్లైతే.. ఈ ఐడియా మీకోసమే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.! అదే యాష్‌ బ్రిక్స్ వ్యాపారం..
బూడిదతో తయారు చేసిన ఇటుకలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.. రాబోయే కాలంలో దాని డిమాండ్ భారీగా ఉంటుంది కూడా. వేగవంతమైన పట్టణీకరణలో బిల్డర్లు ఇప్పుడు బూడిదతో చేసిన ఇటుకలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం 100 గజాల స్థలంతోపాటు కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా మీరు ప్రతి నెలా కనీసం రూ. 1 లక్ష వరకు సంపాదించవచ్చు.
ఈ ఇటుకలను పవర్ ప్లాంట్ల నుంచి బూడిద, సిమెంట్, రాతి ధూళి మిశ్రమం నుంచి తయారు చేస్తారు. ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ యంత్రాన్ని 100 గజాల స్థలంలో సౌకర్యవంతంగా అమర్చవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. యంత్రాన్ని నడపడానికి 5 నుండి 6 మంది వ్యక్తులు అవసరం. దీంతో రోజుకు దాదాపు 3 వేల ఇటుకలు తయారవుతాయి. మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉంటే, మీరు ఆటోమేటిక్ మెషీన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యంత్రం ధర 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్రం ద్వారానే పనులు జరుగుతాయి.
ఆటోమేటిక్ యంత్రంతో గంటలో వెయ్యి ఇటుకలను తయారు చేయొచ్చు… ఈ విధంగా మీరు ఒక నెలలో 3 నుంచి 4 లక్షల ఇటుకలను సులభంగా తయారు చేయవచ్చు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మట్టి లేని కారణంగా ఇటుకలు తయారు చేయడం లేదు. ఉత్తరప్రదేశ్, హర్యానా పంజాబ్ నుంచి ఇక్కడికి ఇటుకలు దిగుమతి అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బూడిద, సిమెంటు, రాళ్లపొడితో తయారు చేసిన ఇటుకలను ఆయా ప్రాంతాల్లో విక్రయించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మాన్యువల్ మెషీన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూడా నెలకు 30 వేల వరకు ఇటుకలను తయారు చేయవచ్చు.
మీ దగ్గర ఉన్న పెట్టుబడిని బట్టి.. వ్యాపారం మొదలుపెట్టొచ్చు.. ఏ వ్యాపారంలో అయినా రిస్క్‌ లేకుండా ఉండదు.. కాబట్టి..మీ ఏరియా, ఇటుకలకు ఉన్న డిమాండ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇది పెట్టొచ్చా లేదా అని ఒక ఐడియాకు వస్తే.. స్టెప్‌ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news