ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం

-

ఏపీ మూడవ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయిలో జన్మించారు. మంగళూరు కొడియాల్‌బెయిల్‌ ఎస్‌డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2004 సెప్టెంబర్‌ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు.

Read more RELATED
Recommended to you

Latest news