స్టార్ స్టార్.. మెగాస్టార్.. చిరంజీవికి వెల్లువెత్తుతున్న జన్మదిన శుభాకాంక్షలు..!

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మొదలుకొని, సెలబ్రిటీల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుండగా, సామాజిక మాధ్యమాలన్నీ ఆయన బర్త్‌డే విషెస్‌తో నిండిపోతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ప్రేక్షకుల్లో గుండెల్లో ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది.. సినీ పరిశ్రమలో ఆయనొక మేరు పర్వతం.. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి పరిశ్రమలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే స్వయంకృషితో ఆయన అగ్ర నటుడిగా ఎదిగారు. ఆయన జీవితం ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తినిస్తుంది. సినీ ఇండస్ట్రీలో రికార్డుల వేట ఆయనతోనే మొదలైందని చెప్పవచ్చు. కేవలం నటనతోనే కాకుండా డ్యాన్స్, సామాజిక సేవా కార్యక్రమాలతోనూ చిరంజీవి ఎంతో అభిమానులను సంపాదించుకోగా.. ఇవాళ ఆయన ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా.. ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు కనుక..!

social media flooded with mega star chiranjeevi birthday wishes

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మొదలుకొని, సెలబ్రిటీల వరకు అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుండగా, సామాజిక మాధ్యమాలన్నీ ఆయన బర్త్‌డే విషెస్‌తో నిండిపోతున్నాయి. ఇక ఇవాళ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు..!